Sabih Khan: 30 ఏళ్ల ప్రయాణంలో.. సాధారణ వ్యక్తి నుంచి ఆపిల్ COO వరకు! సబిహ్ ఖాన్ సక్సెస్ స్టోరీ..!

Sabih Khan: 30 ఏళ్ల ప్రయాణంలో.. సాధారణ వ్యక్తి నుంచి ఆపిల్ COO వరకు! సబిహ్ ఖాన్ సక్సెస్ స్టోరీ..!
x
Highlights

Sabih Khan: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తన పదవీ విరమణ గురించి సంకేతాలు ఇవ్వడంతో, ఆపిల్ సామ్రాజ్యాన్ని ముందుకు నడిపే కొత్త నాయకుడి కోసం వేట మొదలైంది.

Sabih Khan: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తన పదవీ విరమణ గురించి సంకేతాలు ఇవ్వడంతో, ఆపిల్ సామ్రాజ్యాన్ని ముందుకు నడిపే కొత్త నాయకుడి కోసం వేట మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటివరకు పెద్దగా వార్తల్లో లేని సబిహ్ ఖాన్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. నిజానికి సబిహ్ ఖాన్ మూలాలు భారతదేశంలో ఉన్నాయి. 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్లో ఆయన జన్మించారు. చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి సింగపూర్‌కు వలస వెళ్లారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, 1995లో ఆపిల్ కంపెనీలో చేరారు. దాదాపు మూడు దశాబ్దాలుగా కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ, అత్యున్నత స్థాయికి ఎదిగారు.

ఆపిల్‌లో నంబర్ టూ లీడర్‌గా..

ప్రస్తుతం సబిహ్ ఖాన్ ఆపిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 2025లో జెఫ్ విలియమ్స్ స్థానంలో ఆయన ఈ పదవిని చేపట్టారు. టిమ్ కుక్ తర్వాత కంపెనీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఇప్పుడు సబిహ్ ఖాన్‌ను పరిగణిస్తున్నారు.

ఆపిల్‌లో ఆయన పర్యవేక్షించే విభాగాలు ఇవే..

గ్లోబల్ సప్లై చైన్: ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తుల తయారీ, సరఫరా.

AI ఆపరేషన్స్: కృత్రిమ మేధస్సు (AI) విభాగ పర్యవేక్షణ.

ఆపిల్ కేర్: కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్.

ESG: పర్యావరణ, సామాజిక బాధ్యత కార్యక్రమాలు.

ముఖ్యంగా కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతిన్నప్పుడు, ఆపిల్ ఉత్పత్తులు వినియోగదారులకు అందేలా చేయడంలో ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఇది ఆయన ఇమేజ్‌ను కంపెనీలో అమాంతం పెంచేసింది.

సీఈఓ అయ్యే ఛాన్స్ ఉందా?

ఆపిల్ చరిత్రలో ఒకసారి మాత్రమే COO హోదాలో ఉన్న వ్యక్తి CEO అయ్యారు. ఆయనే ప్రస్తుత బాస్ టిమ్ కుక్. ప్రస్తుతం కంపెనీలో టిమ్ కుక్ తర్వాత స్థానంలో ఉన్నది సబిహ్ ఖాన్ కాబట్టి, ఆయన తాత్కాలిక CEOగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కానీ, ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆపిల్ బోర్డు ప్రస్తుతం ఒక "యంగ్ లీడర్" కోసం వెతుకుతున్నట్లు సమాచారం. కంపెనీకి పబ్లిక్ ఫేస్‌గా ఉంటూ, సరికొత్త ఉత్పత్తులను కనిపెట్టే దార్శనికుడి (Visionary) కోసం చూస్తోంది. ఈ రేసులో జాన్ టెర్నస్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. జాన్ టెర్నస్ ఆపిల్‌లో హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అయితే కంపెనీలో సబిహ్ ఖాన్‌కు ఉన్న అనుభవం, కంపెనీపై ఆయనకున్న పట్టు సీఈఓ రేస్‌లో ఆయన్ని బలమైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. ఒకవేళ బోర్డు అనుభవానికే పెద్దపీట వేయాలని భావిస్తే, సుందర్ పిచాయ్ (గూగుల్), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్)ల సరసన మరో భారతీయుడు మరో గ్లోబల్ టెక్ దిగ్గజానికి బాస్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఒక సబిహ్ ఖాన్ లైఫ్ జర్నీ మాత్రం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తన 30 ఏళ్ల ప్రయాణంలో ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి ఆపిల్ COO వరకు ఎదగడం అంటే మామూలు విషయం కాదంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories