Savings Scheme: మీ డబ్బుకి సురక్షితం, లాభం కావాలంటే ఈ స్కీమ్‌లో చేరండి

Savings Scheme
x

Savings Scheme: మీ డబ్బుకి సురక్షితం, లాభం కావాలంటే ఈ స్కీమ్‌లో చేరండి

Highlights

Savings Scheme: ఎక్కడైనా డబ్బును ఇన్వెస్ట్ చేయాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకు డబ్బుల విషయంలో నేడు ఎవరినీ నమ్మలేం. అందుకే తక్కువ వడ్డీ వస్తున్నా కూడా సేఫ్ అని కొన్ని బ్యాంకుల్లోనే డబ్బులు పెడుతుంటారు.

Savings Scheme: ఎక్కడైనా డబ్బును ఇన్వెస్ట్ చేయాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకు డబ్బుల విషయంలో నేడు ఎవరినీ నమ్మలేం. అందుకే తక్కువ వడ్డీ వస్తున్నా కూడా సేఫ్ అని కొన్ని బ్యాంకుల్లోనే డబ్బులు పెడుతుంటారు. అయితే ఇలాంటి సమయంలో పోస్ట్ ఆఫీస్‌ కూడా కస్టమర్లకు అండగా నిలుస్తుంది. అందుకే వివిధ రకాల స్కీములను తీసుకొచ్చింది.

అయితే తాజాగా ఎక్కువ రిస్క్ వద్దనుకునేవారికి ఒక స్కీమ్‌ని తీసుకొచ్చింది. అదేంటంటే...

ఒక ఫిక్స్‌డ్ రిటర్న్స్ అందించే సెక్యూర్ స్కీమ్‌లనే కస్టమర్లు బాగా నమ్ముతారు. అయితే ఇలాంటివి గవర్నమెంట్ స్కీములు చాలానే ఉన్నాయి. ఇందులో పోస్టాఫీస్ అందించే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఒకటి. ఇప్పుడున్న వాటిలో ఈ స్కీమ్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

ఈ స్కీములో పెట్టుబడి పెడితే.. ఎన్ఎస్‌సి పెట్టుబడులతో 5 ఏళ్లలో రూ.5 లక్షలు సంపాదించొచ్చు. ఈ గవర్నమెంట్ స్కీమ్.. గ్యారెంటీడ్ రిటర్న్స్, ట్యాక్స్ బెనిఫిట్స్, ఫ్లెక్సిబిలిటీలను కూడా ఆఫర్ చేస్తుంది. దీనివల్ల ఎక్కువ లాభం పొందొచ్చు.

స్కీమ్‌ గురించి మరిన్ని వివరాలు

ఇదొక స్మాల్ సేవింగ్ స్కీమ్. భారత ప్రభుత్వమే దీన్ని అందిస్తుంది. సేవింగ్స్ చేసి వడ్డీ సంపాదించుకునేవాళ్లకు ఇదొక బెస్ట్ స్కీమ్. ఎందుకంటే ఇది సేఫ్ కాబట్టి. ఈ స్కీమ్‌లో ఒక రూ. 1000 లు పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఎంత పెట్టుబడి పెట్టవచ్చనే దానిపై లిమిట్ ఏమీ లేదు. అయితే మీరు డబ్బులు పెట్టిన తర్వాత ఆ డబ్బుకు మీకు ప్రభుత్వమే హామీ ఇస్తుంది. ఎలాంటి రిస్క్ ఉండదు.

వేగంగా డబ్బు పెరుగుదల

ఈ స్కీమ్‌లో మీరు డబ్బులు పెడితే.. అది వేగంగా పెరుగుతుంది. సంవత్సరానికి 7.7% వడ్డీని సంపాదించొచ్చు. యాన్యువల్లీ కాంపౌండ్ అవుతుంది. దీని అర్ధం మీ డబ్బు వేగంగా పెరుగుతుందని. ఎందుకంటే మీరు సంపాదించే వడ్డీ కూడా కాలక్రమేణా వడ్డీని సంపాదిస్తాయి కదా. అంతేకాదు, వడ్డీ రేట్ల విషయంలో ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు వడ్డీ రేటును రివ్యూ చేస్తుంది. ఇది భవిష్యత్తులో కూడా మారే అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories