ఫెస్టివల్ సేల్ ముందు ఎస్‌బీఐ కార్డ్ శుభవార్త.. ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి కొత్త క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్

ఫెస్టివల్ సేల్ ముందు ఎస్‌బీఐ కార్డ్ శుభవార్త.. ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి కొత్త క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్
x

ఫెస్టివల్ సేల్ ముందు ఎస్‌బీఐ కార్డ్ శుభవార్త.. ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి కొత్త క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్

Highlights

ఫెస్టివల్ షాపింగ్ సీజన్ ముందుగానే ఎస్‌బీఐ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి “ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు”ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి ఇది మరింత లాభదాయకంగా ఉండేలా ప్రత్యేక ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ సదుపాయాలు ఈ కార్డుతో అందుబాటులోకి వచ్చాయి.

ఫెస్టివల్ షాపింగ్ సీజన్ ముందుగానే ఎస్‌బీఐ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి “ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు” ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి ఇది మరింత లాభదాయకంగా ఉండేలా ప్రత్యేక ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ సదుపాయాలు ఈ కార్డుతో అందుబాటులోకి వచ్చాయి.

ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మింత్రా, షాప్సీ, క్లియర్‌ట్రిప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ క్రెడిట్ కార్డు వాడితే ప్రత్యేక క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మింత్రాలో కొనుగోళ్లపై 7.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్, ఫ్లిప్‌కార్ట్, షాప్సీ, క్లియర్‌ట్రిప్‌లలో 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభించేలా ఎస్‌బీఐ కార్డు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తోంది. అయితే ఒక్కో కేటగిరీపై ఒక్కో క్వార్టర్‌లో గరిష్ఠంగా రూ.4,000 వరకు మాత్రమే క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. అదనంగా జొమాటో, ఉబర్, నెట్‌మెడ్స్, పివిఆర్ వంటి కొన్ని ప్రముఖ బ్రాండ్లలో కూడా ఈ కార్డు ఉపయోగిస్తే 4 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. సాధారణ లావాదేవీలపై కూడా 1 శాతం పరిమితిలేని క్యాష్‌బ్యాక్ అందించబడుతుంది. పెట్రోల్ బంకుల్లో కార్డు వినియోగిస్తే 1 శాతం ఫ్యూయల్ సర్‌చార్జ్ మినహాయింపు లభిస్తుంది.

ఈ కార్డు కోసం అప్లై చేయడం కూడా చాలా సులభం. ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా ఎస్‌బీఐ కార్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డిజిటల్‌గా అప్లై చేయొచ్చు. మాస్టర్‌కార్డ్ లేదా వీసా రూపంలో ఈ క్రెడిట్ కార్డు అందుబాటులో ఉంటుంది. క్యాష్‌బ్యాక్ మొత్తాలు ఆటోమేటిక్‌గా వినియోగదారుల నెలవారీ స్టేట్‌మెంట్‌లో జమ అవుతాయి. అయితే విదేశీ కరెన్సీ వినియోగంపై 3.5 శాతం ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ ఉంటుంది.

కార్డు జారీ సమయంలో, అలాగే ప్రతి ఏడాది రీన్యువల్ కోసం రూ.500 ఫీజు విధించబడుతుంది. అయితే ఏడాదిలో రూ.3,50,000 ఖర్చు చేసిన కస్టమర్లకు ఈ ఫీజు తిరిగి రీఫండ్ అవుతుంది. కొత్తగా కార్డు అప్లై చేసే వారికి రూ.1,250 విలువైన వెల్‌కం బెనిఫిట్స్ కూడా ఇవ్వబడతాయి. ఇందులో ఇ-గిఫ్ట్ కార్డులు, క్లియర్‌ట్రిప్ వోచర్లు ఉంటాయి. అలాగే లాంచ్ ఆఫర్‌లో భాగంగా విజయవంతంగా అప్లై చేసినవారు సామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌లు, అంబ్రేన్ వైర్లెస్ పవర్ బ్యాంకులు గెలుచుకునే అవకాశమూ ఉంది.

ఈ సందర్భంగా ఎస్‌బీఐ కార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ సలిలా పాండే మాట్లాడుతూ, వినియోగదారుల అభిరుచులు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ క్రెడిట్ కార్డు రూపొందించామని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం ద్వారా మరింత మంది భారతీయులకు క్రెడిట్ సౌకర్యం చేరువ అవుతుందని అన్నారు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, మింత్రా, షాప్సీ, క్లియర్‌ట్రిప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కోట్లాది యూజర్లు, లక్షలాది విక్రేతలకు మద్దతు ఇస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఈ కొత్త క్రెడిట్ కార్డు ఫెస్టివల్ షాపింగ్‌ను మరింత సులభతరం చేస్తూ, వినియోగదారులకు అదనపు లాభాలు అందించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories