SBI: కస్టమర్లకు భారీ షాక్‌ ఇచ్చిన SBI.. ఇక నుంచి ఆ వడ్డీ రేట్లు తగ్గిపోతాయ్..!

SBI FD Interest Rate Cut 2025
x

SBI: కస్టమర్లకు భారీ షాక్‌ ఇచ్చిన SBI.. ఇక నుంచి ఆ వడ్డీ రేట్లు తగ్గిపోతాయ్..!

Highlights

SBI: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బాండ్ ఆఫ్ ఇండియా(SBI) కీలక నిర్ణయం తీసుకుంది.

SBI: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బాండ్ ఆఫ్ ఇండియా(SBI) కీలక నిర్ణయం తీసుకుంది. 2025 జూన్ 15 నుంచి డిపాజిటర్లకు చెల్లించే వడ్డీ రేట్లను తగ్గించింది. SBI తీసుకున్న రెండు కీలక మార్పుల్లో రిటైల్ టర్మ్ డిపాజిట్లలో రు. 3కోట్ల వరకు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FDs) వడ్డీ రేట్లను 0.25% తగ్గించింది. ఇది కొత్త , రెన్యువల్ అయిన FDలకు వర్తిస్తుంది. అలాగే రెండోది సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు 2.5% తగ్గించింది. ఇప్పటివరకు ఇదే లో లెవెల్. ఈ రెండు మార్పులతో డిపాజిటర్లు తమ FDలు, సేవింగ్స్‌ ఆదాయాన్ని ఇప్పటివరకు వచ్చినదానికంటే తక్కువగా పొందవచ్చు.

ఈ నెల మొదట వారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు(0.5%) తగ్గించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు పలు బ్యాంకులు పలు రకాలుగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడంతో రెపో రేటు ఇప్పుడు 5.50% కి చేరింది. దీంతో చాలా బ్యాంకులు తక్కువ వడ్డీలకే లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాలను మెయింటైన్ చేసేందుకు వివిధ టెన్యూర్ ఆఫ్షన్స్‌తో ఇచ్చే రిటైల్ టర్మ్ డిపాజిట్లపై(రు. 3కోట్ల వరకు) వడ్డీని 25 బేసిస్ పాయింట్లకు (0.25%) తగ్గించింది. అంటే మొత్తంగా సేవింగ్స్ అకౌంట్స్ వడ్డీ రేటు రికార్డ్ స్థాయిలో 2.5% కి తగ్గిపోయింది.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే RBI రెపో రేటు తగ్గించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై అది తీవ్ర ప్రభావం పడుతుంది. ఎస్ బీ ఐ రు. 36 లక్షల కోట్ల లోన్ పోర్ట్ పోలియోలో 45% అంటే రు. 8.3 లక్షల కోట్ల హోమ్ లోన్లు, రు. 1.2 లక్షల కోట్ల ఆటో లోన్లు రెపో రేటుతో ముడిపడి ఉన్నాయి. బ్యాంక్ ఈ లోన్ వడ్డీ రేట్లను తగ్గించింది. ఉదాహరణకు కొత్త కస్టమర్లకు SBI 7.5%కే హోమ్ లోన్ అందిస్తోంది. ఇది గతంలో ఉన్న ఎక్కువ రేట్ల కంటే తక్కువ కదా. అందుకే ఈ వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ వెళ్లితే బ్యాంకు ఆదాయం తగ్గిపోతుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఎస్ బీ ఐ ఏటా రు. 8,100 కోట్లు నష్టపోతుందని అంచనా వేస్తోంది. ఇప్పుడు ఈ సేవింగ్స్ అకౌంట్లలోని వడ్డీని తగ్గించడం వల్ల ఏడాదికి ఎస్ బి ఐ దాదాపుగా రు. 5,750 కోట్లు ఆదా చేయగలుగుతుంది. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories