Shock to Liquor Lovers: సంక్రాంతి వేళ పెరిగిన మద్యం ధరలు.. కిక్కు దిగిపోతోందంటూ ఆవేదన!

Shock to Liquor Lovers: సంక్రాంతి వేళ పెరిగిన మద్యం ధరలు.. కిక్కు దిగిపోతోందంటూ ఆవేదన!
x
Highlights

ఏపీలో సంక్రాంతి వేళ మద్యం ధరలు పెరిగాయి. ఒక్కో బాటిల్‌పై రూ. 10 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

సంక్రాంతి పండుగ వేళ ఏపీలోని మద్యం ప్రియులకు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో మందుబాబులు మండిపడుతున్నారు. ధరలు తగ్గిస్తామని చెప్పి, పండుగ పూట ఇలా పెంచడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రూ. 10 పెరిగిన వైనం

తాజా ఉత్తర్వుల ప్రకారం, వివిధ బ్రాండ్ల మద్యం బాటిళ్లపై రూ. 10 వరకు ధర పెరిగింది. విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపుల వద్ద మందుబాబులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. "రోజుకు రూ. 100 నుంచి రూ. 150 వరకు ఖర్చు పెడుతున్నాం, ఇప్పుడు పది రూపాయలు పెంచితే మా జేబులు గుల్ల అవ్వాల్సిందే" అని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వంపై విమర్శలు

ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ధరలు పెంచడం ధర్మం కాదని మద్యం ప్రియులు విమర్శిస్తున్నారు. "తగ్గిస్తామని చెప్పి పెంచితే ఫుల్లుగా తాగేదెలా?" అంటూ మద్యం షాపుల ముందు చర్చలు నడుస్తున్నాయి. కొందరైతే ధరలు ఇలాగే పెరిగితే మద్యం మానేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.

బీర్ ప్రియులకు ఊరట

లిక్కర్ ధరలు పెరిగినప్పటికీ.. బీర్లు, బ్రీజర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. కేవలం క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిళ్లపైనే ఈ ప్రభావం కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ ఎంజాయ్ చేద్దామనుకున్న తరుణంలో ఈ పెంపు తమ 'కిక్కు'ను పాడు చేస్తోందని వారు వాపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories