Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market
x

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Highlights

Stock Market: భారత్–అమెరికా మధ్య జరగనున్న కీలక వాణిజ్య చర్చల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

Stock Market: భారత్–అమెరికా మధ్య జరగనున్న కీలక వాణిజ్య చర్చల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్ సూచీలు పరిమిత శ్రేణిలోనే కదలాడాయి. ముఖ్యంగా కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 250 పాయింట్లు నష్టపోయి 83,627 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 57 పాయింట్లు తగ్గి 25,732 వద్ద ముగిసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు త్వరలో జరగనున్నాయని భారత రాయబారి సెర్గియో గోర్ ప్రకటించడంతో దలాల్ స్ట్రీట్‌లో జాగ్రత్త ధోరణి నెలకొంది. దీంతో ట్రేడర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు.

స్టాక్స్ పరంగా చూస్తే ఎటర్నల్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడి సూచీలకు కొంత మద్దతు ఇచ్చాయి. అయితే ట్రెంట్, లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ), ఇండిగో వంటి షేర్లలో నష్టాలు రావడంతో మార్కెట్లు మరింత కిందకు లాగబడ్డాయి. మొత్తంగా వాణిజ్య చర్చల ఫలితాలపై స్పష్టత వచ్చే వరకు మార్కెట్లు జాగ్రత్తగా కదలాడే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories