Stock Market Holiday: నేడు స్టాక్ మార్కెట్ ఉందా.. లేక హాలిడే ఇచ్చారా? ఎందుకంత స్పెషల్..!

Stock Market Holiday: నేడు స్టాక్ మార్కెట్ ఉందా.. లేక హాలిడే ఇచ్చారా? ఎందుకంత స్పెషల్..!
x

Stock Market Holiday: నేడు స్టాక్ మార్కెట్ ఉందా.. లేక హాలిడే ఇచ్చారా? ఎందుకంత స్పెషల్..!

Highlights

భారత స్టాక్ మార్కెట్‌లో మంగళవారం (అక్టోబర్ 21న) ముహూర్త ట్రేడింగ్ సెషన్ నిర్వహించారు.

Stock Exchange Holiday: భారత స్టాక్ మార్కెట్‌లో మంగళవారం (అక్టోబర్ 21న) ముహూర్త ట్రేడింగ్ సెషన్ నిర్వహించారు. ఈ ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ స్వల్ప లాభాలతో ముగిశాయి. దీనికి ముందు సోమవారం కూడా వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో వృద్ధి కనిపించింది. అయితే బుధవారం (అక్టోబర్ 22న) స్టాక్ మార్కెట్ నడుస్తుందా, ట్రేడింగ్ చేద్దామని కొత్త ఇన్వెస్టర్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. పండుగ సమయంలో స్టాక్ మార్కెట్ హాలిడే ఉంటుందా.. ఈ రోజు ఎలాంటి వ్యాపారం జరగదా అని కొత్త ఇన్వెస్టర్లలో సందేహాలు నెలకొన్నాయి. క్లారిటీ రావాలంటే ఈ విషయాలు తెలుసుకోండి.

ఈరోజు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఉంటుందా?

స్టాక్ మార్కెట్ జాబితా ప్రకారం.. దీపావళి (Diwali 2025) బలిప్రతిపాద సందర్భంగా ఈరోజు భారత స్టాక్ మార్కెట్ సాధారణ ట్రేడింగ్ నిర్వహించరు. BSE, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE)తో పాటు, కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లు - మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX), నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ (NCDEX)లకు అక్టోబర్ 22న ట్రేడింగ్ సెలవు దినంగా ప్రకటించాయి. దాంతో ఇన్వెస్టర్లు గురువారం వరకు వేచి చూడక తప్పదు. అయితే ఏమైనా ఆర్డర్లు ఉంటే ప్రి బుకింగ్ ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 23న స్టాక్ మార్కెట్ ప్రారంభమయ్యాక మీ టార్గెట్ ప్రైస్ రీచ్ అయితే స్టాక్స్ కొనుగోలు ఆర్డర్, అమ్మకం ఆర్డర్ విజయవంతంగా పూర్తవుతాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

అక్టోబర్ 21న, అంటే నిన్న కూడా భారత స్టాక్ మార్కెట్ మూసివేశారు. కానీ కేవలం ఒక 60 నిమిషాల పాటు ముహూరత్ ట్రేడింగ్ సెషన్ కోసం మాత్రమే స్టాక్ మార్కెట్ సెషన్ నిర్వహించారు. అక్టోబర్ 2025లో స్టాక్ మార్కెట్‌లో 3 రోజుల సెలవు దినాలు ఉన్నాయి. అవి అక్టోబర్ 2, 2025 మహాత్మా గాంధీ జయంతి/ దసరా, అక్టోబర్ 21 దీపావళి లక్ష్మీ పూజ కోసం, అక్టోబర్ 22న దీపావళి బలిప్రతిపాద రోజు స్టాక్ మార్కెట్‌కు హాలిడే ఇచ్చారు.

దసరా, గాంధీ జయంతి ఒకటే రోజున వచ్చాయి కనుక ఒకటే హాలిడే వచ్చింది. రెండూ వేర్వేరు రోజుల్లో వస్తే కనుక స్టాక్ మార్కెట్ కు మరో రోజు సెలవు వచ్చేది. దీపావళి సందర్భంగా ప్రతి ఏడాది లక్ష్మీ పూజ సందర్భంగా ఒకరోజు స్టాక్ మార్కెట్ క్లోజ్ అవుతుంది. కానీ ఆరోజు పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయన్న నమ్మకంతో ఇన్వెస్టర్ల కోసం ఒక గంటపాటు ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఆ 60 నిమిషాలు కొనుగోలు ఆర్డర్లు, సేల్ ఆర్డర్లు చేసుకోవచ్చు. లక్ష్మీపూజ మరుసటి రోజు దీపావలి బలిప్రతిపాద సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు హాలిడే ఉంటుంది.

బలిప్రతిపాద అంటే ఏంటి..

విష్ణువు ఐదవ అవతారం అయిన వామనుడు రాక్షస రాజు బలిని పాతాళం లోకి తొక్కిన రోజు నేడు. ఆ ఘటన జ్ఞాపకార్థం దీపావళి సమయంలో కార్తీక మాసంలో శుక్ల పక్ష ఏకాదశి మొదటి రోజున బలిప్రతిపాదనను జరుపుకుంటారు. బలి చక్రవర్తి గొప్ప విష్ణు భక్తుడు. తన శక్తులతో అందరు రాజులను జయించడం ప్రారంభించాడు. ఇంద్రుడ్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకుని దేవ లోకాన్ని కాపాడాలని విష్ణువును వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు పేద బ్రాహ్మణుడు - వామనుడిగా అవతరించి బలిని సందర్శించాడు. ఏం కావాలో కోరుకోవాలని అడగగా మూడు అడుగుల భూమి కోరగా అందుకు బలి అంగీకరిస్తాడు. తరువాత వామనుడు తన ఆకారం భారీగా పెంచి రెండు అడుగుల్లో భూమి, ఆకాశాన్ని కప్పేస్తాడు విష్ణువు. మూడో అడుగు ఎక్కడ పెట్టాలని వామనుడు అడగగా తల చూపించగా.. పాదం మోపి పాతాళంలోకి తొక్కేస్తారు. ప్రజలు ఆయనతో అనుబంధాన్ని కలిగి ఉండటంతో ఏడాదికి ఇదేరోజు వచ్చి వారిని సందర్శిస్తావని బలికి వామనుడు సూచిస్తాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories