Stock Market Update: నాలుగో రోజు వరుస నష్టాల్లో ముగిసిన సూచీలు

Stock Market Update: నాలుగో రోజు వరుస నష్టాల్లో ముగిసిన సూచీలు
x

Stock Market Update: నాలుగో రోజు వరుస నష్టాల్లో ముగిసిన సూచీలు

Highlights

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఐటీ, రియల్టీ, ఫార్మా, ఆటో రంగాలలో అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో సూచీలు నష్టాల్లో నిలిచాయి.

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఐటీ, రియల్టీ, ఫార్మా, ఆటో రంగాలలో అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో సూచీలు నష్టాల్లో నిలిచాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు మరియు సూచీలను ముందుకు నడిపే కీలక అంశాల కొరత కారణంగా సూచీలు నిలకడగా నష్టాలకే పరిమితమయ్యాయి. సంవత్సరాంతానికి దగ్గరగా ట్రేడింగ్ యాక్టివిటీ కూడా తక్కువగా ఉంది.

సెన్సెక్స్ ఉదయం 85,004.75 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు: 85,041.45) స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. కొద్దిసేపు లాభాల్లోకి వెళ్లినప్పటికీ, అది ఎక్కువ కాలం నిలవలేదు. చివరికి 345.91 పాయింట్ల నష్టంతో 84,695.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 100.20 పాయింట్ల నష్టంతో 25,942.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 89.98గా ఉంది.

సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ట్రెంట్, బీఈఎల్ షేర్లు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఎటెర్నల్ ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ 61.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, బంగారం 4,465 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories