TCS: ఉద్యోగులకు టీసీఎస్ భరోసా.. కానీ అంటూ ట్విస్ట్ ఇచ్చారుగా..!

TCS
x

TCS: ఉద్యోగులకు టీసీఎస్ భరోసా.. కానీ అంటూ ట్విస్ట్ ఇచ్చారుగా..!

Highlights

TCS: కృతివాసన్ మాటల్లో చెప్పాలంటే.. ఏఐ అనేది ఒక 'ఉద్యోగ హంతకి' కాదు, అది కేవలం మన పనితీరును మెరుగుపరిచే ఒక ఉత్పాదక సాధనం.

TCS: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. రోబోలు మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తాయని, కోడింగ్ చేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అవసరం ఉండదని వస్తున్న వార్తలు సామాన్యుల నుండి నిపుణుల వరకు అందరినీ కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా అమెజాన్ సుమారు 16,000 మందిని తొలగిస్తుందనే వార్తలు ఈ భయాలను రెట్టింపు చేశాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే, టీసీఎస్ సీఈఓ కృతివాసన్ ఐటీ రంగ భవిష్యత్తుపై అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు.

కృతివాసన్ మాటల్లో చెప్పాలంటే.. ఏఐ అనేది ఒక 'ఉద్యోగ హంతకి' కాదు, అది కేవలం మన పనితీరును మెరుగుపరిచే ఒక ఉత్పాదక సాధనం. సుమారు 300 బిలియన్ డాలర్ల విలువైన గ్లోబల్ ఐటీ అవుట్‌సోర్సింగ్ రంగం అంతరించిపోతుందన్న వాదనలో వాస్తవం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెద్ద కంపెనీలకు తమ సంక్లిష్టమైన ఐటీ వ్యవస్థలను నిర్వహించడానికి ఎప్పుడూ మానవ మేధస్సు, టెక్నాలజీ వెండర్ల అవసరం ఉంటుందని స్పష్టం చేశారు.

టెక్నాలజీ మారుతున్నప్పుడు కొన్ని పాత పద్ధతులు కనుమరుగవ్వడం సహజం. అయితే ఏఐ వల్ల కొన్ని పనులు పోయినా, దానికి బదులుగా మరిన్ని కొత్త రకాల ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయని ఆయన విశ్లేషించారు. ఐటీ నిపుణులు కేవలం కోడింగ్ లేదా టెస్టింగ్‌కే పరిమితం కాకుండా, మరింత సృజనాత్మకమైన , వ్యూహాత్మకమైన పాత్రల్లోకి ఎదగాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు.

ఏఐ వల్ల పని వేగం పెరుగుతుంది, తద్వారా క్లయింట్లకు ఖర్చు తగ్గుతుంది. అలా మిగిలిన డబ్బును కంపెనీలు మళ్లీ కొత్త ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తాయి. దీనివల్ల మార్కెట్‌లో మరిన్ని కొత్త అవకాశాలు వస్తాయే తప్ప, ఉద్యోగాలు తగ్గవని ఆయన వివరించారు. ఇప్పటికే టీసీఎస్ సుమారు 1.8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కేవలం ఏఐ సంబంధిత ప్రాజెక్టుల నుండే పొందుతుండడం గమనార్హం.

ఉద్యోగులకు టీసీఎస్ సీఈఓ ఇస్తున్న సందేశం

ఏఐని చూసి భయపడకండి.. ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవడం ద్వారా ఏ మార్పునైనా తట్టుకోవచ్చని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పటికే టీసీఎస్ తన లక్షలాది మంది ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ భవిష్యత్తుకు సిద్ధం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories