ఒకే ఒక్క మెయిల్‌.. ఉద్యోగుల గుండెల్లో కలకలం!

ఒకే ఒక్క మెయిల్‌.. ఉద్యోగుల గుండెల్లో కలకలం!
x

ఒకే ఒక్క మెయిల్‌.. ఉద్యోగుల గుండెల్లో కలకలం!

Highlights

ఉద్యోగస్తులందరి కల ఒకటే—కంపెనీ నుంచి తమను తొలగించకూడదనే. కానీ, అకస్మాత్తుగా జాబ్ టెర్మినేషన్ మెయిల్ వస్తే? గుండె ఆగిపోయేంత పనిగా ఉంటుంది. అలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది.

ఒక కంపెనీ హెచ్ఆర్‌ నుండి “Termination” అనే సబ్జెక్ట్‌లైన్‌తో ఉద్యోగులందరికీ మెయిల్ వెళ్లింది. ఈ మెయిల్ చూసిన క్షణంలోనే అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. “మనల్ని ఉద్యోగం నుంచి తీసేశారా?” అన్న అనుమానం కలిగింది. కానీ మెయిల్ ఓపెన్ చేసి చూసేసరికి ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే, ఆ మెయిల్‌లో “భద్రతా ఉల్లంఘనల కారణంగా ఇద్దరు ఉద్యోగులను మాత్రమే తొలగించాం” అని రాసి ఉంది.

అయినా, ఆ కొన్ని క్షణాల టెన్షన్‌తో కొందరు “మెయిల్ చూసిన వెంటనే గుండెపోటు వచ్చినట్లే అనిపించింది” అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆ మెయిల్ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమతమ రీతిలో హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

నిజానికి కోవిడ్ కాలంలో ఇలాంటి టెర్మినేషన్ మెయిల్స్ అనేకమంది ఉద్యోగులకు వచ్చాయి. అప్పటి నుంచి ఇలాంటి సబ్జెక్ట్‌లైన్ కనిపిస్తేనే ఉద్యోగులు గుబులు పడుతున్నారు. అందుకే ఈ మెయిల్ చూసిన క్షణాల్లో చాలామంది కంగారుపడ్డారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories