Flight Fare: ప్రమాదాల పాఠంతో మారిన ధరలు.. విమానాల్లో వింగ్ దగ్గర సీటుకు పెరిగిన రేటు

Flight Fare
x

Flight Fare: ప్రమాదాల పాఠంతో మారిన ధరలు.. విమానాల్లో వింగ్ దగ్గర సీటుకు పెరిగిన రేటు

Highlights

Flight Fare: విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏ సీటు అత్యంత సేఫెస్ట్ అని ఆలోచిస్తున్నారా.. ఆ సీటును ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఇప్పుడు ఎక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి.

Flight Fare: విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏ సీటు అత్యంత సేఫెస్ట్ అని ఆలోచిస్తున్నారా.. ఆ సీటును ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఇప్పుడు ఎక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదానికి సంబంధించిన ఒక నివేదిక, దానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్‌లు ఈ అంశాన్ని చర్చకు తెచ్చాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఈ సీటు ధర మరింత పెరుగుతుందని, ఇది అత్యంత ఖరీదైన సీటుగా మారుతుందని అనేక పోస్ట్‌లలో వాదిస్తున్నారు.

రెండు ప్రమాదాలలో ఇదే సీటులో కూర్చున్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో సీటు నంబర్ 11Aలో కూర్చున్న రమేష్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే విమానానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ సీటు రెక్కల (వింగ్) దగ్గర ఉన్న ఓవర్‌వింగ్ సీటు, దీనిని ఏవియేషన్ ఇండస్ట్రీలో సాధారణంగా 'స్ట్రక్చరల్ స్ట్రాంగ్' అంటే నిర్మాణపరంగా బలంగా పరిగణిస్తారు.

ఇదే కాదు, 1998 డిసెంబర్ 11న, థాయ్ నటుడు, గాయకుడు రువాంగ్‌సాక్ లాయ్చుసాక్ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. థాయ్ ఎయిర్‌వేస్ విమానం TG261 దక్షిణ థాయ్‌లాండ్‌లో ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఒక చిత్తడి నేలలో క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 146 మందిలో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. రువాంగ్‌సాక్ అదే విమానంలో సీటు 11Aలో కూర్చున్నాడు.

ఈ సంఘటనల తర్వాత అలాంటి సీట్లపై ప్రయాణికులలో ఆసక్తి, అవగాహన రెండూ పెరిగాయి. ముఖ్యంగా, అనేక అంతర్జాతీయ అధ్యయనాలు, క్రాష్ విశ్లేషణ నివేదికలలో కూడా విమానం వెనుక భాగంలో లేదా రెక్కల పైభాగాన ఉన్న సీట్లు సాపేక్షంగా సురక్షితమైనవిగా పరిగణిస్తుంటారు. ఈ భాగం విమానం నిర్మాణంలో అత్యంత బలమైనది, ఎందుకంటే ఇది రెక్కలకు అనుసంధానించబడి ఉంటుంది. ఇది అత్యవసర నిష్క్రమణ (ఎమర్జెన్సీ ఎగ్జిట్) దగ్గర ఉండడం వల్ల, రెస్క్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సీట్లలో అదనపు లెగ్ స్పేస్ కూడా ఉంటుంది. ఇది సౌకర్యాన్ని అందిస్తూనే, త్వరగా బయటపడటానికి సహాయపడుతుంది.

విమానంలో లెగ్ స్పేస్ లేదా విండో సీటు కోసం ఇప్పటికే అదనపు ఛార్జ్ వసూలు చేస్తున్న చోట, ఇప్పుడు ఏవియేషన్ కంపెనీలు సేఫ్టీ వ్యాల్యూ ను కూడా కొత్త ఛార్జింగ్ పాయింట్‌గా మార్చవచ్చు. సురక్షితమైనవిగా భావించే సీట్లను ఉద్దేశపూర్వకంగా ఎంచుకోవాలనుకునే ప్రయాణికుల నుంచి అదనపు రుసుము వసూలు చేయడం ఎయిర్‌లైన్స్‌కు కొత్త ఆదాయ వనరుగా మారవచ్చు.

కొన్ని బడ్జెట్, ప్రీమియం క్యారియర్‌లు ఈ సీట్లను 'సేఫ్టీ ప్రీమియం సీట్' కేటగిరీలో చేర్చడాన్ని పరిశీలించడం ప్రారంభించాయి. టిక్కెట్ బుకింగ్ సమయంలో ఇప్పుడు కేవలం విండో, ఐల్ లేదా అదనపు లెగ్ రూమ్ మాత్రమే కాకుండా, హై సేఫ్టీ జోన్ కూడా ఒక ఆప్షన్ ఉండవచ్చు. ఇది ప్రయాణికులకు మరింత సురక్షితమైన ప్రయాణాన్ని ఎంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. అదే సమయంలో ఎయిర్‌లైన్స్‌కు అదనపు ఆదాయాన్ని సమకూర్చుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories