Top
logo

Petrol Diesel Price Today: ఆకాశమే హద్దు అంటోన్న పెట్రోల్, డీజిల్ ధరలు

Today Petrol Price in Hyderabad Rajahmundry Diesel Price Today 12 07 2021
X

Petrol Diesel Price Today:(File Image) 

Highlights

Petrol Diesel Price Today: నేడు పెట్రోల్ ధరలు 25 నుంచి 35 పైసల వరకు పెంచగా, డీజిల్ ధరలు 15 నుంచి 17 పైసల వరకు తగ్గాయి.

Petrol Diesel Price Today: సామాన్యులకు ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా రోజూ రోజుకూ పెట్రోల్, డిజిల్ ధరలు పెరగడం తప్ప తగ్గడం మాత్రం కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించని కేంద్రం... ఇప్పుడు ధరలు పెంచడానికి మాత్రం అంతర్జాతీయ ధరలే కారణమని చెబుతోంది. వీటికి తోడు కేంద్రం, రాష్ట్రాలు వేసే పన్నుల వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగదారులపై విపరీతమైన భారం పడుతోంది. మరోవైపు ఈ ధరల వలన రవాణా చార్జీలు కూడా పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.

అసలే సంక్షోభం.. ఆ పై కోవిడ్ దెబ్బ.. వీటితో కుదేలైన సామాన్యుడు.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో తీవ్రంగా దెబ్బ తింటున్నాడు. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల.. ఒక లీటర్ పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ కొట్టి ముందుకు దూసుకెళుతున్నాయి. నేడు పెట్రోల్ ధరలు 25 నుంచి 35 పైసల వరకు పెంచగా, డీజిల్ ధరలు 15 నుంచి 17 పైసల వరకు తగ్గాయి.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాన్ని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.101.19 కాగా, డీజిల్‌ ధర రూ.89.72 వద్ద కొసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 107.20 ఉండగా, డీజిల్‌ రూ. 97.29 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.101.92 కాగా, డీజిల్‌ రూ. 94.24 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో …

హైదరాబాద్‌లో సోమవారం లీటర్‌ పెట్రోల్‌ రూ. 105.15 ఉండగా, డీజిల్‌ రూ. 97.78గా నమోదైంది. కొమురం భీమ్‌ అసీఫాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 107.21కి చేరింది. ఇక్కడ లీటర్‌ డీజిల్‌ రూ. 99.69 వద్ద కొనసాగుతోంది. విజయవాడంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.107.43 కాగా, డీజిల్‌ రూ. 99.49 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 106.60 ఉండగా, డీజిల్‌ ధర రూ. 98.68గా కొనసాగుతోంది.

Web TitleToday Petrol Price in Hyderabad Rajahmundry Diesel Price Today 12 07 2021
Next Story