Stock Market: సరికొత్త రికార్డ్ సృష్టించిన స్టాక్ మార్కెట్

Today Stock Market Open with Nifty 60 Points and Sensex 187 Points 24 09 2021 | Business News Today
x

 సరికొత్త రికార్డ్ సృష్టించిన స్టాక్ మార్కెట్(ఫోటో-ది హన్స్ ఇండియా)

Highlights

* 60వేల పాయింట్లు ఎగువన సెన్సెక్స్ * 18వేల మార్క్‌ వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. సెన్సెక్స్‌ ఆరంభంలోనే 60వేల పాయింట్ల మైలురాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ సైతం 18వేల పాయింట్ల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అటు అమెరికా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. దేశీయంగా పలు సానుకూల పరిణామాలూ బుల్‌ రంకెకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 187 పాయింట్ల లాభంతో 60వేల 72 వద్ద.. నిఫ్టీ 60 పాయింట్లు లాభపడి 18వేల 748 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 73రూపాయల 78పైసల వద్ద ట్రేడవుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్ పెయింట్స్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా షేర్లు రాణిస్తున్నాయి. టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, టైటన్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫినాన్స్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories