Trump Tariffs: గేమ్స్ ఆడాలని ప్రయత్నిస్తే తీవ్రపరిణామాలు.. ఆ దేశాలకు ట్రంప్ హెచ్చరిక

Trump Tariffs టారీఫ్స్‌పై ట్రంప్‌ మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని.. ఆటలు ఆడాలనుకునే దేశాలుపై భారీ టారీఫ్స్ తప్పవని హెచ్చరించారు.
x
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 
Highlights

టారీఫ్స్‌పై ట్రంప్‌ మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని.. ఆటలు ఆడాలనుకునే దేశాలుపై భారీ టారీఫ్స్ తప్పవని హెచ్చరించారు.

Trump టారీఫ్స్: అధ్యక్షుడు ట్రంప్ విధించిన అత్యవసర సుంకాలను ఈరోజు నుండి అమెరికా ప్రభుత్వం నిలిపివేయనుంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం దేశాలను సుంకాల ఒప్పందం నుండి వైదొలుగుతామని హెచ్చరించారు.

వాణిజ్య ఒప్పందం పేరుతో అమెరికాతో "గేమ్స్" ఆడటానికి ప్రయత్నించే ఏ దేశమైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని, మరింత ఎక్కువ సుంకాలను విధించడానికి దారితీస్తుందని ఆయన అన్నారు. వాస్తవానికి, యుఎస్ సుప్రీంకోర్టు ఈ సుంకాలను మూడు రోజుల ముందే చట్టవిరుద్ధమని ప్రకటించింది. యుఎస్ కస్టమ్స్ - బోర్డర్ ప్రొటెక్షన్ (CPB) ఒక ప్రకటనలో ఇలా చెప్పింది: “1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద విధించిన ఈ సుంకాలు మంగళవారం (IST కాలమానం ప్రకారం ఉదయం 10:30) నుండి ఆగిపోతాయి. ఈ సుంకాలకు సంబంధించిన అన్ని కోడ్‌లను వారి కార్గో వ్యవస్థల నుండి తొలగించాలని ఏజెన్సీ దిగుమతిదారులకు సూచించింది.”



అమెరికా వెనక్కి ఇవ్వాల్సి రావచ్చు..

పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్‌లోని ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం.. ఈ కోర్టు నిర్ణయంతో అమెరికా ప్రభుత్వం $175 బిలియన్ల (రూ. 15.75 లక్షల కోట్లు) కంటే ఎక్కువ ఆదాయాన్ని తిరిగి ఇవ్వవలసి వస్తుంది. అలాగే, రాయిటర్స్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, IEEPA కింద విధించిన సుంకాల వల్ల US కి రోజుకు $500 మిలియన్ (రూ. 4,500 కోట్లు) కంటే ఎక్కువ నష్టం వాటిల్లింది. ఇప్పుడు ఈ సుంకాలు రద్దు చేసినందువాళ్ళ కంపెనీలు వాపసు కోరవచ్చు.

స్పష్టత లేదు

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మూడు రోజుల తర్వాత ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు. ఈ మూడు రోజుల్లో సుంకాలు ఎందుకు వసూలు చేస్తున్నారు అనేది ఏజెన్సీ వివరించలేదు. డబ్బు అందుకున్న వారికి వాపసు లభిస్తుందా లేదా అనే విషయం కూడా స్పష్టం చేయలేదు.

ఈ ఆదేశం IEEPA చట్టం కింద విధించిన సుంకాలకు మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుంది అంటున్నారు. అయితే, జాతీయ భద్రత పేరుతో సెక్షన్ 232, అన్యాయమైన వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద విధించిన సుంకాలు అమలులో ఉంటాయి. ఈ తీర్పు ద్వారా ప్రభావితం కావని అక్కడి అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories