Aadhaar Card Update: జూన్ 14 వరకే మిత్రమా.. త్వరగా ఈ పని పూర్తి చేయండి.. లేదంటే డబ్బులు చెల్లించాల్సిందే..!

Update Aadhaar Card Free Till June 14th Otherwise You May to Pay Fee For Updation
x

Aadhaar Card Update: జూన్ 14 వరకే మిత్రమా.. త్వరగా ఈ పని పూర్తి చేయండి.. లేదంటే డబ్బులు చెల్లించాల్సిందే..!

Highlights

*ఈ సేవ కేవలం myAadhaar పోర్టల్‌లో మాత్రమే ఉచితం. భౌతిక ఆధార్ కేంద్రాలలో 50 రూపాయల ఛార్జీ కొనసాగుతుందని UIDAI స్పష్టం చేసింది.

Aadhaar Card Update: భారతదేశంలో చాలా ముఖ్యమైన పత్రాలలో ఆధార్ కార్డ్ ఒకటి. ఆధార్ కార్డు ద్వారానే అనేక పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో అనేక సౌకర్యాలు పొందడానికి ఆధార్ కార్డును కూడా ఉపయోగిస్తుంటారు. ప్రజలు తమ ఆధార్ కార్డును కూడా అప్‌డేట్ చేసుకోవాలని చాలా సార్లు గమనించారు. ఇటువంటి పరిస్థితిలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 14 జూన్ 2023 వరకు ఆధార్ పత్రాల ఆన్‌లైన్ అప్‌డేషన్‌ను ఉచితంగా చేసే అవకాశం ఇచ్చింది. సాధారణంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి దాదాపు రూ.50 లేదా రూ.100 ఫీజు ఉంటుంది. అయితే, UIDAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో జనాభా వివరాలను అప్‌డేట్ చేయడం జూన్ 14 వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

ఆధార్ కార్డు అప్‌డేట్..

ఈ సేవ కేవలం myAadhaar పోర్టల్‌లో మాత్రమే ఉచితం. భౌతిక ఆధార్ కేంద్రాలలో 50 రూపాయల ఛార్జీ కొనసాగుతుందని UIDAI స్పష్టం చేసింది. వాస్తవానికి, UIDAI ద్వారా ఆధార్ కార్డును అప్‌డేట్ చేయమని ప్రోత్సహిస్తున్నారు. ఆధార్ కార్డ్ 10 సంవత్సరాల క్రితం తయారు చేశారు. ఆధార్ కార్డ్ జారీ చేసిన తర్వాత ఎప్పుడూ అప్‌డేట్ చేయలేదు.

ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి..

- ఆధార్ నంబర్‌ని ఉపయోగించి https://myaadhaar.uidai.gov.in/ కి లాగిన్ చేయాలి .

'ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్' ఎంపికను ఎంచుకోవాలి.

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

ఆ తర్వాత మీరు 'డాక్యుమెంట్ అప్‌డేట్'పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత, ఏదైనా అప్‌డేట్ చేయవలసి ఉంటుంది.

చివరగా 'సబ్మిట్' బటన్‌ను ఎంచుకోవాలి. డాక్యుమెంట్స్‌ను అప్‌డేట్ చేయడానికి, వాటి కాపీలను అప్‌లోడ్ చేయాలి.

ఆధార్ అప్‌డేట్ కోసం 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) వస్తుంది.

అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ని ఉపయోగించి ఆధార్ చిరునామా అప్‌డేట్ స్టేటస్‌ను తనిఖీ చేయవచ్చు.

అప్‌డేట్ చేసినప్పుడు, మీరు అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింటెడ్ ఆధార్ కార్డ్‌ని పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories