Fixed Deposit: సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, లింక్‌డ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మధ్య తేడాలేంటి..?

What is the Difference Between Linked FD and Normal Fixed Deposit in which you Get Higher Returns
x

Fixed Deposit: సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, లింక్‌డ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మధ్య తేడాలేంటి..?

Highlights

Fixed Deposit: ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పొదుపు చేయాలని కోరుకుంటారు. ఇందులో అందరికి మొదటగా గుర్తుకువచ్చేది బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి).

Fixed Deposit: ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పొదుపు చేయాలని కోరుకుంటారు. ఇందులో అందరికి మొదటగా గుర్తుకువచ్చేది బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి). ఇందులో సేవింగ్స్‌ ఖాతా కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. పెట్టుబడిదారులు తమ డిపాజిట్లను 10 సంవత్సరాల వరకు లాక్‌ పీరియడ్‌ పెట్టుకోవచ్చు. దీనివల్ల అధిక రాబడిని పొందవచ్చు. అయితే సేవింగ్స్, FD రెండింటి ప్రయోజనాలను అందించే మరొక ఆప్షన్‌ కూడా ఉంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

లింక్డ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఏమిటి?

పేరు సూచించినట్లుగా లింక్డ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే సేవింగ్స్‌ ఖాతాను FD డిపాజిట్లతో లింక్ చేస్తుంది. ఇది ఆటో స్వీప్-ఇన్-స్వీప్-అవుట్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఇక్కడ నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ మొత్తం ఆటోమేటిక్‌గా FDగా మారుతుంది. సాధారణంగా ఒక సంవత్సరం FDపై వడ్డీ రేటు ఆటో స్వీప్ రోజు నుంచి ప్రారంభమవుతుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

లింక్డ్ ఎఫ్‌డీలు తప్పనిసరిగా కస్టమర్ల పొదుపు ఖాతాల్లో ఉన్న డబ్బును ఫ్లెక్సిబుల్ ఎఫ్‌డి డిపాజిట్‌లలో ఆదా చేయడానికి అనుమతిస్తాయి. అధిక వడ్డీ రేట్లను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు మీ పొదుపు ఖాతాలో రూ. 1,00,000 కలిగి ఉంటే, అది సంవత్సరానికి సగటున 3-4% వడ్డీని సంపాదిస్తుంది. మీకు అవసరమైనప్పుడు దాన్ని యాక్సెస్ చేయవచ్చు.

ఒకవేళ మీరు ఈ అమౌంట్‌ని లాక్ చేసినట్లయితే మీరు అధిక వడ్డీ రేట్లు పొందుతారు. అయితే ఈ డబ్బు మెచ్యూరిటీ వరకు అందుబాటులో ఉండదు. కానీ లింక్డ్ FDలో ఇది జరగదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌ డ్రా చేసుకోవచ్చు. చాలా బ్యాంకులు ఈ రకమైన లింకింగ్‌ను ఉచితంగా అందిస్తాయి. సేవింగ్స్ ఖాతాలో ఉండే గరిష్ట మొత్తం, స్వైప్ అవుట్ మొత్తాన్ని బ్యాంకు నిర్ణయిస్తుంది. ఇవి మీ అవసరాలకు సరిపోలకపోతే మీరు ఇతర ఆప్షన్స్‌ ఎంచుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories