Most Expensive Car: తరతరాల సంపాదనా సరిపోదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు..!

Most Expensive Car: తరతరాల సంపాదనా సరిపోదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు..!
x

Most Expensive Car: తరతరాల సంపాదనా సరిపోదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు..!

Highlights

ఇతర దేశాలకు పోటీగా భారతదేశంలోనూ పలు ప్రముఖ కంపెనీల కొత్త కార్లు విడుదలవుతున్నాయి.

Most Expensive Car: ఇతర దేశాలకు పోటీగా భారతదేశంలోనూ పలు ప్రముఖ కంపెనీల కొత్త కార్లు విడుదలవుతున్నాయి. కానీ కొన్ని కార్లపై అందరి దృష్టి పడుతుంది. ఈ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఏది అని తెలుసుకునేందుకు ప్రజలు సాధారణంగా ఆసక్తి చూపుతారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఏది, ఆ కారు ధర ఎంత, ఏం ఫీచర్లు ఉన్నాయో ఇక్కడ మీకు అందిస్తున్నాం.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో ఖరీదైన, లగ్జరీ కార్లు విడుదలయ్యాయి. అయితే ఈ కార్లన్నింటిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు రోల్స్-రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్‌టైల్ (Rolls Royce La Rose Noire Droptail). రోల్స్ రాయిస్ ఈ కారును ఆగస్టు 2023లో గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కారు దాదాపు 30 మిలియన్ డాలర్ల ధరతో విడుదలైంది. ఆ సమయంలో భారత కరెన్సీలో ఈ కారు ధర 211 కోట్ల రూపాయలు.

రోల్స్-రాయిస్ కారులో ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చునేలా డిజైన్ చేశారు. ఈ సూపర్ కారు హార్డ్‌టాప్‌ను మీరు కావాలనుకుంటే తొలగించవచ్చు. రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్‌టైల్‌లో ట్విన్-టర్బో 6.75 లీటర్, V 12 ఇంజిన్ ఉంది. ఈ లగ్జరీ కారు ఇంజిన్ 563 bhp పవర్, 820 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది. ఈ కారు బాడీ కార్బన్, స్టీల్‌తో పాటు అల్యూమినియంతో తయారు చేశారు.

రోల్స్ రాయిస్ కారు La Rose Noire Droptail ప్రత్యేకత ఏమిటంటే.. మీరు పలు వైపులు, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూసినప్పుడు కారు బాడీ రంగులు మారుతున్నట్లు కనిపిస్తుంది. ఈ కారు బాడీ పెయింట్‌ను దాదాపు 150 పరీక్షల తర్వాత ఫిక్స్ చేశారు. ఈ రోల్స్ రాయిస్ లగ్జరీ కారును బ్లాక్ బకార రోజ్ రేకులని చూసి డిజైన్ చేశారు. ఈ రకమైన పువ్వులు ఫ్రాన్స్‌లో కనిపిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories