Gold Rate: పసిడి ధర రూ. 1 లక్ష దాటిందని కంగారు వద్దు..2026లో తులం బంగారం ఎంత పెరుగుతుందో తెలిస్తే షాక్ తినడం ఖాయం

Gold Rate: పసిడి ధర రూ. 1 లక్ష దాటిందని కంగారు వద్దు..2026లో తులం బంగారం ఎంత పెరుగుతుందో తెలిస్తే షాక్ తినడం ఖాయం
x
Highlights

Gold Rate: బంగారం ధరలు గత నెల రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి ఇప్పటికే ఒక లక్ష రూపాయలు దాటిన బంగారం ధర కొద్దిగా తగ్గుముఖం పట్టింది అయితే ఇంకా...

Gold Rate: బంగారం ధరలు గత నెల రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి ఇప్పటికే ఒక లక్ష రూపాయలు దాటిన బంగారం ధర కొద్దిగా తగ్గుముఖం పట్టింది అయితే ఇంకా బంగారంలో పస తగ్గలేదని, భవిష్యత్తులో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందనిప్రముఖ ఆర్థిక నిపుణుడు ఎడ్ యార్డెని తెలిపారు. బంగారం ధర 2025 చివరి నాటికి ఒక ట్రాయ్ ఔన్స్ ( 31.2 గ్రాములు) 4000 డాలర్లు దాటే అవకాశం ఉందని తెలిపారు.

ఇది భారతీయ మార్కెట్లో గమనించినట్లయితే, 10 గ్రాములకు గానూ సుమారు రూ.1,35,000 చేరొచ్చని అంచనా వేశారు. 2026 నాటికి ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 5000 డాలర్లు దాటే అవకాశం ఉందని అప్పుడు భారతీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ.1,53,000 వరకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ఏడాది బంగారం ధర 29 శాతం పెరిగిందని, అయితే గత ఏడాది 25% పెరిగిందని గుర్తు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అదే విధంగా వాణిజ్య యుద్ధం, డాలర్ బలహీనత వంటి కారణాలవల్ల బంగారం డిమాండ్ భారీగా పెరుగుతోంది. చాలా దేశాలు అలాగే సెంట్రల్ బ్యాంకులు డాలర్లకు బదులుగా బంగారాన్ని భద్రపరుచుకుంటున్నారు.ఎందుకంటే డాలర్ కన్నా కూడా బంగారమే సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు. బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పుడే అందులో పెట్టుబడి పెడితే మంచిదని ఎడ్ యార్డెని సూచించారు. స్టాక్ మార్కెట్ తో పోల్చి చూసినట్లయితే బంగారం సురక్షితమైనటువంటి పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లకు కనిపిస్తోందని అందుకే బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories