తెలంగాణలో సైకిల్‌ పంక్చర్‌... గులాబీ గూటికి తమ్ముళ్లు ?

తెలంగాణలో సైకిల్‌ పంక్చర్‌... గులాబీ గూటికి తమ్ముళ్లు ?
x
Highlights

తెలంగాణలో టీడీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారా...? కారేక్కేందుకు వారు మార్గం సుగమం చేసుకున్నారా...? సండ్ర వెంకట వీరయ్య, మచ్చా...

తెలంగాణలో టీడీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారా...? కారేక్కేందుకు వారు మార్గం సుగమం చేసుకున్నారా...? సండ్ర వెంకట వీరయ్య, మచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరుతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే తాను పార్టీ మారడం లేదని నాగేశ్వరరావు తేల్చేశారు. సండ్ర టీఆర్ఎస్ చేరికపై సొంత నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 13 మంది టీడీపీ తరపున పోటీ చేసినా సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మచ్చా నాగేశ్వర రావు గెలిచారు. వీరిద్దరు పార్టీ మారుతున్నారనే వదంతులు జోరుగా వినిపిస్తున్నాయి. వీరు ఇందుకోసం మంతనాలు సాగించినట్లు తెలిసింది. సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, అనుచరులతో దీనిపై చర్చలు జరిపారు.

అయితే సండ్ర రాకను సొంత నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. సండ్ర చేతిలో ఓటమి పాలైన టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి సండ్రపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి, ఎంపీ, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ కాళ్లు మొక్కడానికి బయలుదేరారని పిడమర్తి రవి ఎద్దేవా చేశారు. సండ్ర చేరిక పరిస్థితి ఇలా ఉంటే మరో ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు మరో విధంగా స్పందించారు. తాను పార్టీ మారడం లేదని... టీడీపీలోనే కొనసాగుతానని తేల్చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వదంతులకు సంబంధం లేదన్నారు మచ్చా నాగేశ్వరరావు. పార్టీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు పక్క పార్టీ వైపు చూస్తున్నారనే వార్తలు టీడీపీ శ్రేణుల్లో కలవరం పుట్టిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories