Astrologer: జ్యోతిష్యం చెప్పిస్తానని నమ్మించి మహిళపై లైంగిక దాడి.!

జ్యోతిష్యం చెప్పిస్తానని నమ్మించి మహిళపై లైంగిక దాడి.!
x

జ్యోతిష్యం చెప్పిస్తానని నమ్మించి మహిళపై లైంగిక దాడి.!

Highlights

పూణేలో ఘోర ఘటన వెలుగుచూసింది. జ్యోతిష్యం చెప్పిస్తానని నమ్మించి ఓ మహిళపై జ్యోతిష్కుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

పూణేలో ఘోర ఘటన వెలుగుచూసింది. జ్యోతిష్యం చెప్పిస్తానని నమ్మించి ఓ మహిళపై జ్యోతిష్కుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ధంకావడి ప్రాంతానికి చెందిన అఖిలేష్ అక్ష్మణ్ రాజ్‌గురు (45) అనే జ్యోతిష్కుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే – 25 ఏళ్ల కాలేజీ విద్యార్థిని తన సోదరుడి జాతక వివరాలు చెప్పించుకోవడానికి రాజ్‌గురు వద్దకు వెళ్లింది. జాతకం పరిశీలించిన అతడు, మరుసటి రోజు ఒక ప్రత్యేక వస్తువు ఇవ్వాల్సి ఉంటుందని ఆమెను తన కార్యాలయానికి రమ్మన్నాడు.

ఆమె మరుసటి రోజు రాజ్‌గురు ఆఫీస్‌కి వెళ్లిన సమయంలో, అతడు ఆమెను లైంగికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై డీసీపీ మిలింద్ మోహితే మీడియాకు వివరాలు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories