Breaking: నిజామాబాద్ జిల్లాలో దారుణం..9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

Breaking: నిజామాబాద్ జిల్లాలో దారుణం..9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య
x

Breaking

Highlights

Breaking: నిజామాబాద్ జిల్లాలో దారుణం. ఇందల్వాయి మండలం ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది

Breaking: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాకు చెందిన ఇందల్వాయి మండలం ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రామ్ చరణ్ (15) హాస్టల్ బాత్ రూమ్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

రామ్ చరణ్ ఆఫీసాబాద్ జిల్లా చెందిన వ్యక్తి గా తెలుస్తోంది. అయితే, విద్యార్థి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది.

Breaking: ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రెండు నెలల కిందట అనుమతి లేకుండా సెల్ ఫోన్ తీసుకువచ్చాడని ప్రిన్సిపాల్ మందలించి సస్పెండ్ చేశారు. రిక్వెస్ట్ లెటర్ తీసుకుని మళ్ళీ ప్రిన్సిపాల్ స్కూలుకు అనుమతి ఇచ్చారు. అయితే, రెండవసారి మళ్ళీ ఫోన్ దొరకడంతో అక్కడి స్టాఫ్ మందలించారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రాంచరణ్ బాత్ రూమ్ లో తాడుతో ఉరి వేసుకోవడం చుసిన తోటి విద్యార్థులు సెక్యూరిటీ కి సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది రాంచరణ్ ను నిజామాబాద్ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాంచరణ్ మరణించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories