Fire Accident In Covid Hospitial: కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..50 మంది మృతి

Fire Accident In Covid Hospitial: ఇరాక్ లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 39 మంది మృతి చెందారు.

Kranthi
Updated on: 13 July 2021 6:39 AM IST
Fire Broke Out in Covid Hospital in Iraq and at Least 50 Dead
X

Fire Accident In Covid Hospital

Fire Accident In Covid Hospitial: బతుకు జీవుడా అంటూ కోవిడ్ తో పోరాడుతూ ఆసుపత్రికి వచ్చి ప్రాణాలు నిలుపుకుందామని అనుకుంటే అక్కడ కూడా ఏదోరూపంలో మృత్యువు కబలిస్తోంది. ఇరాక్ లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 50 మంది రోగులు చనిపోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన ఇరాక్ లోని నసీరియా పట్టణంలో ఆల్ –హుస్సేన్ కోవిడ్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో మంటలు వ్యాపించినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. గత ఏప్రిల్ లో కూడా ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది రోగులు చనిపోగా 110 మంది గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆసుపత్రిలో మంటలతో పాటు ధట్టమైన పొగలు అలముకున్నాయి. అంతే కాకుండా కోవిడ్ వార్డులో చిక్కుకున్న రోగులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Kranthi

Kranthi

Next Story