Crime News: నోట్లో డిటోనేటర్‌ పేల్చి భార్యను హత్య చేసిన ప్రియుడు

Crime News: నోట్లో డిటోనేటర్‌ పేల్చి భార్యను హత్య చేసిన ప్రియుడు
x

Crime News: నోట్లో డిటోనేటర్‌ పేల్చి భార్యను హత్య చేసిన ప్రియుడు

Highlights

కర్ణాటకలోని మైసూరు జిల్లా సాలిగ్రామ్‌లో చోటుచేసుకున్న దారుణం అందరినీ షాక్‌కు గురిచేసింది. 22 ఏళ్ల దర్శిత అనే యువతిని ఆమె ప్రియుడు సిద్దరాజు లాడ్జిలో దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

కర్ణాటకలోని మైసూరు జిల్లా సాలిగ్రామ్‌లో చోటుచేసుకున్న దారుణం అందరినీ షాక్‌కు గురిచేసింది. 22 ఏళ్ల దర్శిత అనే యువతిని ఆమె ప్రియుడు సిద్దరాజు లాడ్జిలోదారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దర్శిత నోట్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్‌ అమర్చి పేల్చడం ద్వారా ఆమెను చంపేశాడని పోలీసులు నిర్ధారించారు. పేలుడు ధాటికి ఆమె ముఖం గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయింది.

కేరళ, కన్నూరు జిల్లా పడియూరుకు చెందిన సుభాష్‌తో దర్శిత రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం సుభాష్‌ దుబాయ్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే పెళ్లికి ముందే సిద్దరాజుతో దర్శిత ప్రేమలో ఉండగా, పెళ్లి తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగినట్టు విచారణలో తేలింది. ఆమెకు రెండేళ్ల చిన్నారి కూడా ఉంది.

రెండు రోజుల క్రితం దర్శిత తన కూతురుతో కలిసి అదృశ్యమైంది. మొదట పుట్టింటికి వెళ్లిందనుకున్న అత్తింటివారు, ఆ తరువాత ఇంట్లోని నగలు, డబ్బు తీసుకెళ్లి ఉండొచ్చని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ చివరికి సాలిగ్రామ్‌ లాడ్జిలో దర్శిత మృతదేహం లభించడంతో సంచలనం రేగింది. మొబైల్‌ ఫోన్‌ పేలుడు వల్లే మరణించిందని నమ్మించే ప్రయత్నం చేసిన సిద్దరాజు, చివరికి విచారణలో నోట్లో డిటోనేటర్‌ పెట్టి, ఫోన్‌ ఛార్జర్‌ వైర్‌కు కనెక్ట్‌ చేసి హత్య చేసినట్టు బయటపడింది.

దర్శిత వద్ద నుంచి 22 లక్షల విలువైన బంగారం, 4 లక్షల రూపాయలు అదృశ్యమయ్యాయని ఆమె అత్తింటివారు చెబుతున్నారు. అయితే సిద్దరాజు వద్ద డబ్బు దొరకలేదని పోలీసులు తెలిపారు. దర్శిత సిద్దరాజుకు గతంలో 80 వేలు అప్పుగా ఇచ్చినట్టు కూడా సమాచారం. వచ్చే నెలలో తన భర్త దగ్గరకు దుబాయ్ వెళ్తానని చెప్పడంతో సిద్దరాజు కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories