Viral News: ఇలాంటి మహిళలే వీడి టార్గెట్!

Viral News: ఇలాంటి మహిళలే వీడి టార్గెట్!
x

Viral News: ఇలాంటి మహిళలే వీడి టార్గెట్!

Highlights

ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘరానా మోసం వెలుగుచూసింది. తాను పోలీసుడినంటూ నకిలీ వేషం వేసుకుని వితంతువులు, ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆర్థిక, శారీరకంగా మోసం చేస్తున్న నౌషద్ త్యాగి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Viral News: ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘరానా మోసం వెలుగుచూసింది. తాను పోలీసుడినంటూ నకిలీ వేషం వేసుకుని వితంతువులు, ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆర్థిక, శారీరకంగా మోసం చేస్తున్న నౌషద్ త్యాగి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు పేరు నౌషద్ అయిన ఈ వ్యక్తి, రాహుల్ త్యాగిగా మారి మూడు సంవత్సరాలుగా తప్పుడు వైఖరితో వ్యవహరిస్తూ, సుమారు 20 మంది మహిళలను మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో 10 మందిని లైంగికంగా వాడుకున్నట్టు విచారణలో వెల్లడైంది.

మహిళలను మోసం చేయడమే లక్ష్యంగా…

నౌషద్ త్యాగి పోలీసు యూనిఫాం, నకిలీ ఐడీ కార్డులు ఉపయోగిస్తూ, వితంతువులు మరియు భర్తలతో విడిపోయిన మహిళలకు పెళ్లి మాటలు చెప్పి మాయమాటలు మాట్లాడేవాడు. వారి విశ్వాసాన్ని దూరదృష్టితో గెలుచుకొని, వారిని మోసం చేశాడు. ఇతని మోసాల జాడ కేవలం యూపీకి మాత్రమే కాదు – ఢిల్లీ, ఘజియాబాద్, మధుర, బులంద్‌షహర్, సంభాల్‌తో పాటు అస్సాం, మేఘాలయ వరకు విస్తరించింది.

ఒక ఫిర్యాదుతో బయటపడిన నాటకం

ఓ బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి ముజఫర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందాలు నౌషద్‌ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించాయి. విచారణలో అతడి నేర చరిత్ర ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల హెచ్చరిక

ఈ కేసుపై స్పందించిన ముజఫర్‌నగర్ ఎస్పీ సత్యనారాయణ ప్రజాపత్, “బాధితుల సమాచారం గోప్యంగా ఉంచి దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఇతడి చేతిలో మోసపోయిన మరెవరైనా ఉంటే నిర్భయంగా ఫిర్యాదు చేయండి” అని పేర్కొన్నారు.

సూచన: సామాజిక విశ్వాసాలను దుర్వినియోగం చేస్తూ ఇలాంటి మోసాలు జరగడం ఆందోళన కలిగించే అంశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Show Full Article
Print Article
Next Story
More Stories