Radhika Yadav Update: టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ హత్య కేసులో సంచలన మలుపు – వైరల్ వీడియోే కారణమా?

Radhika Yadav Update: టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ హత్య కేసులో సంచలన మలుపు – వైరల్ వీడియోే కారణమా?
x

Radhika Yadav Update: టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ హత్య కేసులో సంచలన మలుపు – వైరల్ వీడియోే కారణమా?

Highlights

జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన కుమార్తెను ఆమె స్వయంకృతం అయిన సాంగ్ వీడియోలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఆమెను హత్య చేసినట్లు ఆమె తండ్రి దీపక్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన కుమార్తెను ఆమె స్వయంకృతం అయిన సాంగ్ వీడియోలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఆమెను హత్య చేసినట్లు ఆమె తండ్రి దీపక్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఒక వీడియో వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. అదే ఈ దారుణానికి గల ప్రధాన కారణంగా మారిందని ప్రాథమికంగా తెలుస్తోంది.

దీపక్‌కు ఇన్‌స్టాగ్రామ్ వీడియోలపై అభ్యంతరం

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్స్, ఓ మ్యూజిక్ వీడియోలో రాధిక ఓ వ్యక్తితో క్లోజ్‌గా కనిపించడం దీపక్‌ను తీవ్రంగా కుదిపేసినట్లుగా పోలీసులు వివరించారు. ‘కార్వాన్’ అనే మ్యూజిక్ వీడియోలో గాయని భుజంపై తల వాల్చిన రాధికను చూసి, దీపక్ కోపంగా ఉన్నాడని సమాచారం. వీడియోను తొలగించమని తండ్రి పదే పదే చెప్పినా, రాధిక అందుకు ఒప్పుకోలేదని పోలీసులు వెల్లడించారు.

రాధిక విజయాన్ని జీర్ణించుకోలేని తండ్రి

గురుగ్రామ్‌లో తన స్వంత టెన్నిస్ అకాడమీని ప్రారంభించిన రాధిక రోజురోజుకూ ఆర్థికంగా స్వతంత్రంగా ఎదుగుతుండటంతో దీపక్ అసహనం పెరిగింది. గ్రామస్తులు తనను “కుమార్తె డబ్బులతో బతికేవాడివి” అంటూ ఎద్దేవా చేసిన విషయాన్ని ఆయన పోలీసులకు తెలిపారు. దీనితో తీవ్ర అవమానంగా భావించిన దీపక్, రాధికను అకాడమీ మూసేయమని ఒత్తిడి చేస్తున్నాడు.

చివరకు జరిగిన హత్య

హత్య జరిగిన రోజే ఉదయం రాధికతో దీపక్ వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో కోపానికి లోనైన దీపక్, తుపాకితో ఆమెను కాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇదంతా ఒక చిన్న వీడియోకే కారణమైందని భావించడమే బాధాకరం.

ఈ ఘటనతో మరోసారి సోషల్ మీడియా స్వేచ్ఛ, కుటుంబ సంబంధాల మధ్య విరోధాలు ఏ స్థాయికి వెళ్లవచ్చో తెలియజేస్తోంది. ఇప్పటికే ఈ కేసుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories