Serial Deaths: తురకపాలెంలో వరుస మరణాలు.. ఐదు నెలల్లో 30 మంది ప్రాణాలు కోల్పోవడంతో కలకలం

Serial Deaths: తురకపాలెంలో వరుస మరణాలు.. ఐదు నెలల్లో 30 మంది ప్రాణాలు కోల్పోవడంతో కలకలం
x

Serial Deaths: తురకపాలెంలో వరుస మరణాలు.. ఐదు నెలల్లో 30 మంది ప్రాణాలు కోల్పోవడంతో కలకలం

Highlights

గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత ఐదు నెలల వ్యవధిలోనే సుమారు 30 మంది గ్రామస్తులు మృతిచెందడం పెద్ద కలకలం రేపింది.

గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత ఐదు నెలల వ్యవధిలోనే సుమారు 30 మంది గ్రామస్తులు మృతిచెందడం పెద్ద కలకలం రేపింది.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్యశాఖ జాగ్రత్తలు ప్రారంభించింది. ఇప్పటికే ఎపిడిమిక్ బృందంతో పాటు గుంటూరు మెడికల్ కాలేజీకి చెందిన ఎస్‌పి‌ఎం, మైక్రో బయాలజీ నిపుణుల బృందం గ్రామంలో పర్యటిస్తోంది. మృతుల కుటుంబాల నుండి రక్త నమూనాలు సేకరించగా, నీటి శాంపిల్స్ కూడా తీసుకున్నారు.

ఈ మరణాలకు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులే కారణమా? లేక వేరే కారణమా? అన్న కోణంలో అధికారులు పరీక్షలు జరుపుతున్నారు. రక్తం, నీటి నమూనాలపై జరుగుతున్న టెస్టుల ఫలితాలు రాగానే అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

గ్రామంలో వరుస మరణాలపై అధికారులు అప్రమత్తం అవ్వడం, ప్రజల్లో ఆందోళన పెరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories