Lucknow murder: ప్రేమికుడి కోసం కన్నకూతుర్ని హత్య చేసిన తల్లి

Lucknow murder: ప్రేమికుడి కోసం కన్నకూతుర్ని హత్య చేసిన తల్లి
x

Lucknow murder: ప్రేమికుడి కోసం కన్నకూతుర్ని హత్య చేసిన తల్లి

Highlights

మానవత్వాన్ని తాకట్టు పెట్టిన దారుణం యూపీలో చోటుచేసుకుంది. ప్రేమికుడితో సుఖసమాజానికి అడ్డుగా ఉందని, ఓ తల్లి స్వయంగా తన ఐదేళ్ల కూతురి గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘోర సంఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు.

లక్నో: మానవత్వాన్ని తాకట్టు పెట్టిన దారుణం యూపీలో చోటుచేసుకుంది. ప్రేమికుడితో సుఖసమాజానికి అడ్డుగా ఉందని, ఓ తల్లి స్వయంగా తన ఐదేళ్ల కూతురి గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘోర సంఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు.

వివాహేతర సంబంధం కోసం ఘోర నేరం

స్థానికుల సమాచారం ప్రకారం, రోషి ఖాన్ అనే మహిళకు ఉదిత్ జైస్వాల్‌తో వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ వ్యవహారంపై ఆమె భర్త షారుఖ్ ఖాన్‌తో తరచూ గొడవలు జరుగుతున్నాయి. చివరికి రోషి, తన ప్రియుడితో సుఖంగా ఉండటానికి స్వంత కుమార్తెనే అడ్డుగా భావించింది.

కూతుర్ని చంపి భర్తపై నేరం నెట్టే ప్రయత్నం

ప్లాన్ ప్రకారం రోషి, తన ఐదేళ్ల కూతురి గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత చాకచక్యంగా పోలీసులకు ఫోన్ చేసి, భర్తే కూతుర్ని చంపేశాడని ఫిర్యాదు చేసింది. విచారణలో పోలీసులు ఆమెను కఠినంగా ప్రశ్నించగా, నిజం బయటపడింది.

దేశంలో ఇలాంటి ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కన్నకూతుర్ని చంపేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories