Viral: సెల్ఫీ దిగుదామని చెప్పి.. భర్తను నీళ్లలో తోసేసి.. ఆ తర్వాత భార్య ఏం చేసింది?

Viral: సెల్ఫీ దిగుదామని చెప్పి.. భర్తను నీళ్లలో తోసేసి.. ఆ తర్వాత భార్య ఏం చేసింది?
x

Viral: సెల్ఫీ దిగుదామని చెప్పి.. భర్తను నీళ్లలో తోసేసి.. ఆ తర్వాత భార్య ఏం చేసింది?

Highlights

సమాజం ఎటుపోతుందో ఎవరికీ అర్ధం కావడంలేదు. భార్యలు ఈ మధ్య ఇంతలా ఎందుకు తెగిస్తున్నారో తెలియడం లేదు. భర్తతో కాపురం చేయడం ఇష్టం లేకపోతే చట్టం ద్వారా విడిపోయే అవకాశం ఉంది.

సమాజం ఎటుపోతుందో ఎవరికీ అర్ధం కావడంలేదు. భార్యలు ఈ మధ్య ఇంతలా ఎందుకు తెగిస్తున్నారో తెలియడం లేదు. భర్తతో కాపురం చేయడం ఇష్టం లేకపోతే చట్టం ద్వారా విడిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా ఏకంగా భర్తలనే చంపేస్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి సఘటనలే. తాజాగా బైక్‌పై వెళుతున్న భార్యాభర్తలు, వంతెన రాగానే భార్య సెల్ఫీ దిగుదామని భర్తను అడిగింది. వంతెనపై పక్కన బండి ఆపి ఫోటో దిగుదామని వెళ్లారు. తీరా వెళ్లాక..

ప్రతి సమస్యకు ఒక మంచి పరిష్కారం కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ మధ్య చాలామంది భార్యలు వాళ్లకొచ్చిన సమస్యలను పరిష్కరించుకోడానికి లేదంటే వాళ్లు కావాలనుకునే లైఫ్‌ని పొందడానికి భర్తలను నిర్ధాక్షణంగా చంపేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని యాద్గిర్‌‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఓ మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై వెళుతుంది. కృష్ణానది దగ్గరకు రాగానే తన భర్తతో లొకేషన్ బావుంది..సెల్ఫీ తీసుకుందామని చెప్పి బైక్ ఆపించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బ్రిడ్జ్ పక్క వరకు వెళ్లి ఫోటో తీసుకుంటూ ఉంటారు. అంతలో ఆమెకు ఏం పుట్టిందో ఏంటో ఒక్కసారి తన భర్తను బ్రిడ్జ్ పై నుంచి నీళ్లలోకి తోసేసింది. ఆ తర్వాత తన భర్త ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాడంటూ బందువులకు ఫోన్ చేసి లబోదిబోమంటూ ఏడ్చింది.

అయితే అదృష్టం ఏంటంటే.. ఆ వ్యక్తి నీటిలో పడిన కాసేపటికి ఒక బండరాయిని పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ పై అక్కడకొచ్చిన స్థానికులు తాళ్లతో అతన్ని పైకి తీసారు. పైకి వచ్చిన తర్వాత తాను కాలు జారి పడిపోలేదని, తన భార్యే తనని నీళ్లలోకి తోసేసిందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పోలీసులు కేసును నమోదు చేసి, ధర్యాప్తు చేస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories