Wife Murders Husband: భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య..!

Wife Murders Husband: భర్త హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య
x

Wife Murders Husband: భర్త హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య

Highlights

ఓ భార్య భర్తను హత్య చేసి, ఇంటి ఆవరణలోనే పాతిపెట్టి తలదాచుకుంది. దీన్ని ఎవరికీ తెలియకుండా రోజూ మామూలుగా జీవిస్తూ వచ్చింది. కానీ కొద్ది రోజుల తరువాత ఆమె నాటకం అడ్డంగా బహిరంగమైంది.

గువాహటి: ఓ భార్య భర్తను హత్య చేసి, ఇంటి ఆవరణలోనే పాతిపెట్టి తలదాచుకుంది. దీన్ని ఎవరికీ తెలియకుండా రోజూ మామూలుగా జీవిస్తూ వచ్చింది. కానీ కొద్ది రోజుల తరువాత ఆమె నాటకం అడ్డంగా బహిరంగమైంది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం – గువాహటి జోయ్‌మతి నగర్‌కు చెందిన సబియాల్ రెహ్మాన్‌ (38), రహీమా దంపతులుగా 15 ఏళ్ల నుంచి జీవిస్తూ పాత ఇనుపసామాన్ల వ్యాపారం చేస్తూ జీవించేవారు. అయితే ఇటీవల భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. దాంతో జూన్ 26న రహీమా తన భర్తను హత్య చేసి ఇంటి ప్రాంగణంలో ఐదు అడుగుల లోతు గుంత తేసి పాతిపెట్టింది.

భర్త కేరళకు వ్యాపార పనులకెళ్లాడని చెబుతూ పక్కింటివారిని నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ రోజులు గడుస్తున్నా అతడు తిరిగి రాకపోవడంతో స్థానికులు అనుమానంతో రహీమా ఆరోగ్యం బాగోలేదంటూ తప్పించుకొని వెళ్లిపోయింది. ఇది చుట్టుపక్కలవారికి మరింత అనుమానంగా అనిపించి, విషయం అతడి సోదరుడికి తెలియజేశారు.

జూలై 12న అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే విచారణ ప్రారంభించి, జూలై 13న రహీమా లొంగిపోయింది. తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. పోలీసులు శవాన్ని బయటకు తవ్వించి ఫోరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం నమూనాలు పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ హత్యకు మరెవరికైనా సంబంధముందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories