YouTuber Suicide: ప్రేమ వ్యవహారం విషాదాంతం.. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య


ప్రేమ వ్యవహారం విషాదాంతం.. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య
Rayadurgam suicide case: హైదరాబాద్ రాయదుర్గంలో యువతి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ రాయదుర్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా 21 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నానికి చెందిన కోమలి హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతూ మణికొండలోని చిత్రపురి కాలనీలో బంధువుల వద్ద నివసిస్తోంది.
ఇదే సమయంలో విశాఖపట్నానికి చెందిన ఒక యువకుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలిసింది. పెళ్లి విషయమై ఇటీవల తలెత్తిన వివాదంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోమలి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



