AIASL Recruitment 2023: నిరుద్యోగులకి శుభవార్త.. పదో తరగతితో ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు..!

AIASL Recruitment 2023: నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే పదో తరగతితో ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే అవకాశం వచ్చింది.

Arun Chilukuri
Updated on: 5 Sept 2023 9:01 PM IST
AIASL Recruitment 2023 Check For All Details
X

AIASL Recruitment 2023: నిరుద్యోగులకి శుభవార్త.. పదో తరగతితో ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు..!

AIASL Recruitment 2023: నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. ఎందుకంటే పదో తరగతితో ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే అవకాశం వచ్చింది. ముంబైలోని ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌స్పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఏఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో హ్యాండీమ్యాన్‌ పోస్టులు 971, యుటిలిటీ ఏజెంట్‌ పోస్టులు 27 ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

హ్యాండీమ్యాన్‌ పోస్టులకు ఎస్‌ఎస్‌సీ లేదా 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే వయోపరిమితి 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. యుటిలిటీ ఏజెంట్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన సర్టిఫికెట్‌ ఉండాలి. వయోపరిమితి 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు సడలింపు ఉంటుంది. జనరల్‌ అభ్యర్ధులకు 28 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 31 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్దులకు 33 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది. సెప్టెంబర్‌ 18, 2023వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది.

ఫిజికల్‌ ఎండ్యురెన్స్‌ టెస్ట్‌, పర్సనల్‌ లేదా వర్చువల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆధారంగా పోస్టుల భర్తీ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,330 చొప్పున జీతం చెల్లిస్తారు. మరిన్ని వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్‌ చూడండి. ఆసక్తి కలిగిన వారు కింది అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్రస్‌.. HRD Department, AI Airport Services Limited, GSD Complex, Near Sahar Police Station, CSMI Airport, Terminal-2, Gate No. 5, Sahar, Andheri-East, Mumbai-400099.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story