AP Inter Hall Tickets 2026: ఏపీ ఇంటర్ హాల్‌టికెట్లు వచ్చేశాయి.. వాట్సప్‌లో డౌన్‌లోడ్ చేసుకోండిలా.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు బుక్‌లెట్ నిబంధనల్లో మార్పు!

AP Inter Hall Tickets 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లను (AP Inter Hall Tickets 2026) ఇంటర్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది.
AP Inter Hall Tickets 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లను (AP Inter Hall Tickets 2026) ఇంటర్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను బోర్డు వెబ్‌సైట్‌తో పాటు, ప్రభుత్వ వాట్సప్ గవర్నెన్స్ సేవ ‘మనమిత్ర’ ద్వారా సులభంగా పొందవచ్చు.
వాట్సప్‌లో హాల్‌టికెట్ పొందే విధానం:
మీ ఫోన్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేయండి.
ఆ నంబర్‌కు వాట్సప్‌లో 'Hi' అని మెసెజ్ పంపితే ఒక లింక్ వస్తుంది.
'Choose services' పై క్లిక్ చేసి, 'Education services' ఎంచుకోవాలి.
'IPE 2026 Hall Ticket' ఆప్షన్‌ను ఎంచుకుని, మీ ఆధార్/టెన్త్ హాల్‌టికెట్/పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే హాల్‌టికెట్ నేరుగా మీ వాట్సప్‌కే వస్తుంది.
పరీక్షల ఏర్పాట్లు - గణాంకాలు:
ఈ ఏడాది మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 5,31,275 మంది కాగా, సెకండ్ ఇయర్ వారు 5,26,624 మంది ఉన్నారు.
ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కీలక మార్పులు:
ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు సిలబస్ మరియు సమాధాన పత్రాల్లో బోర్డు కీలక మార్పులు చేసింది:
ఇప్పటి వరకు 24 పేజీల బుక్‌లెట్ ఇస్తుండగా, ఈసారి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 32 పేజీల బుక్‌లెట్ ఇవ్వనున్నారు. అదనంగా ఎక్స్‌ట్రా షీట్లు ఇవ్వరు, అన్ని జవాబులు ఈ 32 పేజీల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. గణితం, భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల్లో ప్రశ్నల సంఖ్య పెరగడంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పేజీల సంఖ్యను పెంచినట్లు బోర్డు వెల్లడించింది. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మాత్రం పాత పద్ధతిలోనే 24 పేజీల బుక్‌లెట్ అందజేస్తారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



