CBSE Results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్​ చేసుకోండి..!

CBSE Class 12 Results Announced
x

CBSE Results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్​ చేసుకోండి..!

Highlights

CBSE Results: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న CBSE 12వ తరగతి ఫలితాలు 2025 అధికారికంగా విడుదలయ్యాయి.

CBSE Results: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న CBSE 12వ తరగతి ఫలితాలు 2025 అధికారికంగా విడుదలయ్యాయి. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మంగళవారం ఉదయం ఈ ఫలితాలను ప్రకటించింది. 12వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో సులభంగా చెక్‌ చేసుకోవచ్చు.

CBSE 12వ తరగతి ఫలితాలు 2025 ఎలా చెక్ చేయాలి?

విద్యార్థులు తమ ఫలితాలను దిగువ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు:

📌 cbse.gov.in

📌 cbseresults.nic.in

ఫలితాలు తెలుసుకోవడానికి అవసరమైనవి:

రోల్ నంబర్

పుట్టిన తేదీ

స్కూల్ నంబర్

అడ్మిట్ కార్డు నంబర్

ఈ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత, స్కోరు కార్డు తెరవచ్చు.

మొబైల్ యాప్‌ల ద్వారా ఫలితాలు

డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌ను ప్రోత్సహిస్తూ, CBSE ఫలితాలను DigiLocker మరియు UMANG మొబైల్ యాప్‌ల ద్వారా కూడా చూడొచ్చు. అందులో రిజిస్ట్రేషన్ చేసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

CBSE 10వ తరగతి ఫలితాలపై అప్డేట్

ప్రస్తుతం CBSE 10వ తరగతి ఫలితాలు 2025 విడుదలపై అధికారిక సమాచారం రాలేదు. అయితే ఇదే రోజున విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

దేశవ్యాప్తంగా 42 లక్షల మంది విద్యార్థులు హాజరు

ఈసారి దేశంలోని 7,842 పరీక్ష కేంద్రాలు, అలాగే 26 దేశాల్లో CBSE 10, 12వ తరగతి పరీక్షలు నిర్వహించగా, మొత్తం 42 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో:

24.12 లక్షల మంది 10వ తరగతి పరీక్షలు

17.88 లక్షల మంది 12వ తరగతి పరీక్షలు రాశారు.

ఈ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 మధ్య కాలంలో నిర్వహించిన విషయం తెలిసిందే.

మెరిట్ జాబితాలపై CBSE నిర్ణయం

విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు CBSE గత కొన్ని సంవత్సరాలుగా మెరిట్ జాబితాలను విడుదల చేయకుండా నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం కూడా అదే ప్రకారం ఫలితాలను ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories