Exam Alert: జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరీక్షల జాతర.. ఏ తేదీల్లో ఏ పరీక్ష ఉందంటే?

Exam Alert: జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరీక్షల జాతర.. ఏ తేదీల్లో ఏ పరీక్ష ఉందంటే?
x
Highlights

జనవరి, ఫిబ్రవరి 2026 నెలల్లో జరగనున్న టెట్, జేఈఈ, గేట్, ఎస్ఎస్‌సీ మరియు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలు.

2025-26 విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో అటు విద్యార్థులు, ఇటు ఉద్యోగ అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ రెండు నెలలు వరుస పరీక్షలతో మస్త్ బిజీగా మారిపోయాయి. ఇప్పటికే పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్స్ విడుదలవ్వగా, వాటితో పాటు కేంద్ర, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు కూడా క్యూ కట్టాయి.

జనవరి మరియు ఫిబ్రవరి 2026లో జరగనున్న ప్రధాన పరీక్షల పూర్తి వివరాలు ఇవే:

ప్రధాన పోటీ మరియు ప్రవేశ పరీక్షల షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు (APPSC/Other)

ఏపీలో పలు కేటగిరీల పోస్టులకు జనవరి ఆఖరున మరియు ఫిబ్రవరిలో పరీక్షలు జరగనున్నాయి:

జనవరి 27న: అసిస్టెంట్ ఇంజినీర్.

జనవరి 27 - 28: అగ్రికల్చర్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్ (లైబ్రేరియన్ సైన్స్), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్.

జనవరి 27 - 29: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్.

జనవరి 27 - 30: హార్టికల్చర్ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ (గ్రూప్-4).

ఫిబ్రవరి 9 - 10: ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్.

ఫిబ్రవరి 11: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3.

ఫిబ్రవరి 12 - 13: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్.

ముఖ్య గమనిక:

ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ల నుండి పరీక్షకు వారం లేదా పది రోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా మార్పులు ఉంటే అధికారిక ప్రకటనల ద్వారా తెలుసుకోవడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories