Rail Kaushal Vikas Yojana: నిరుద్యోగులకు కేంద్రం బంపర్‌ ఆఫర్.. పది పాసైతే రైల్వేలో ఉచిత శిక్షణ..!

Rail Kaushal Vikas Yojana Unlocking Employment Opportunities Through Skill Development Introduced By Railway Ministry
x

Rail Kaushal Vikas Yojana: నిరుద్యోగులకు కేంద్రం బంపర్‌ ఆఫర్.. పది పాసైతే రైల్వేలో ఉచిత శిక్షణ..!

Highlights

Rail Kaushal Vikas Yojana Benefits: రైల్వే మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు బంపర్‌ అవకాశం అందిస్తోంది. కేవలం పది పాసైతే చాలు రైల్వేలో శిక్షణ అందిస్తోంది.

Rail Kaushal Vikas Yojana Benefits: రైల్వే మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు బంపర్‌ అవకాశం అందిస్తోంది. కేవలం పది పాసైతే చాలు రైల్వేలో శిక్షణ అందిస్తోంది. దీంతో ఎక్కడైనా ఉద్యోగం పొందవచ్చు. ఆ పథకం పేరే 'రైల్‌ కౌశల్ వికాస్‌ యోజన' (Rail Kaushal Vikas Yojana). ఈ పథకానికి ఎవరు అర్హులు, ఇతర పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రధానంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో రైల్వే మంత్రిత్వ శాఖ 'రైల్‌ కౌశల్‌ వికాస్‌' (Rail Kaushal Vikas Yojana) యోజన ప్రారంభించింది. దేశంలో నిరుద్యోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇలాంటి పథకాల ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే యువతకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారు ఎక్కడైనా ఉద్యోగం సులభంగా పొందుతారు. ఎందుకంటే శిక్షణ తర్వాత సర్టిఫికేట్‌ కూడా రైల్వే అందిస్తోంది.

భారత రైల్వేస్‌ మంత్రిత్వ శాఖ ఈ పథకం ద్వారా ప్రధానంగా నిరుద్యోగులకు మెకానిక్‌, ఇన్‌స్ట్రూమెంటేషన్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ కార్పోరేట్‌, ఎలక్ట్రికల్‌ వెల్డింగ్‌, ఐటీఐ వంటి ట్రేడ్‌ సంబంధిత శిక్షణ అందిస్తుంది. శిక్షణ కాలం పూర్తయిన తర్వాత వారికి సర్టిఫికేట్‌ అందజేస్తారు.

రైల్‌ కౌశల్‌ వికాస్‌ యోజనకు అర్హులు ఎవరు?

మన దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ ఈ పథకానికి అర్హులు

దరఖాస్తుదారులు కనీసం పది పాసై ఉండాలి.

వీరి వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

రైల్‌ కౌశల్‌ వికాస్‌ యోజనకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్‌ కార్డు, హై స్కూల్‌ మార్క్‌ షీట్‌, మొబైల్‌ నంబర్‌, వయస్సు ధృవీకరణ పత్రం, ఈమెయిల్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో అవసరం. వీటితో రైల్‌ కౌశల్‌ వికాస్ యోజన అధికారిక వెబ్‌సైట్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్‌ https://railkvy.indianrailways.gov.in/ లో నోటిఫికేషన్‌ క్షుణ్నంగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ కావాల్సిన పత్రాలు స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. చివరగా సబ్‌మిట్‌ బట్టన్‌ నొక్కాలి. ఇక రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 50 వేల మందికి పైగా శిక్షణ తీసుకున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకన్న దాదాపు అందరూ ఉద్యోగం కూడా పొందారనే సమాచారం ఉంది. మీరు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదవండి.

Show Full Article
Print Article
Next Story
More Stories