RBI Jobs : ఆర్బీఐలో అసిస్టెంట్ కొలువులు..నెలకు రూ.58 వేల జీతం 650 పోస్టులు.. అస్సలు మిస్సవద్దు

RBI Jobs : ఆర్బీఐలో అసిస్టెంట్ కొలువులు..నెలకు రూ.58 వేల జీతం 650 పోస్టులు.. అస్సలు మిస్సవద్దు
x
Highlights

ఆర్బీఐలో అసిస్టెంట్ కొలువులు..నెలకు రూ.58 వేల జీతం 650 పోస్టులు.. అస్సలు మిస్సవద్దు

RBI Jobs : బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ బ్రాంచుల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా ఆర్బీఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేయాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 650 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా ముంబయి రీజియన్‌లో 249 పోస్టులు ఉండగా, మన హైదరాబాద్‌ బ్రాంచులో 11 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

అర్హతలు ఏముండాలి?

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు కేవలం పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది. వీటితో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే రాష్ట్రంలోని స్థానిక భాషను (తెలుగు రాష్ట్రాలైతే తెలుగు) అనర్గళంగా చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి.

వయోపరిమితి, జీతభత్యాలు

ఫిబ్రవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఫిబ్రవరి 2, 1998 కంటే ముందు, ఫిబ్రవరి 1, 2006 తర్వాత జన్మించి ఉండకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయో సడలింపు ఉంటుంది. ఇక జీతం విషయానికి వస్తే, ఎంపికైన వారికి అన్ని అలవెన్స్‌లు కలిపి నెలకు సుమారు రూ.58,514 వరకు వేతనం అందుతుంది. సెంట్రల్ బ్యాంక్ ఇచ్చే ఇతర బెనిఫిట్స్ అదనం.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. మొదట ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఈ రెండు పరీక్షలు ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతాయి. చివరిగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LPT) నిర్వహిస్తారు. అంటే అభ్యర్థికి స్థానిక భాషపై ఎంత పట్టు ఉందో పరీక్షిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మార్చి 8, 2026 లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

పరీక్ష ఫీజు, తేదీలు

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.450 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు కేవలం రూ.50 ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే ఉంటాయి.

* దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 16, 2026

* చివరి తేదీ: మార్చి 8, 2026

* ప్రిలిమ్స్ పరీక్ష: ఏప్రిల్ 11, 2026

* మెయిన్స్ పరీక్ష: జూన్ 7, 2026

Show Full Article
Print Article
Next Story
More Stories