RRB Recruitment: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 9,970 జాబ్స్‌పై కీలక అలెర్ట్!

RRB Recruitment
x

RRB Recruitment: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 9,970 జాబ్స్‌పై కీలక అలెర్ట్!

Highlights

RRB Recruitment: ఇండియన్ రైల్వే 2025లో 9,970 ALP పోస్టులకు నియామకం చేపట్టింది. అప్లికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 10 నుంచి ప్రారంభమై మే 9 వరకు కొనసాగుతుంది.

RRB Recruitment: రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా మంచి అవకాశంగా నిలిచింది. 2025కి సంబంధించి ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ నియామక ప్రకటనను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి ఈ ప్రకటన వెలువడింది. మొత్తం 9,970 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ పోస్టుల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 10, 2025 నుంచి ప్రారంభమవుతుండగా, మే 9 చివరి తేదీగా నిర్ణయించబడింది. ఈ ఉద్యోగాలు భారతదేశం అంతటా విస్తరించి ఉన్నాయి. అర్హత కలిగినవారు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైన తర్వతే, అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయస్సు పరిమితి, ఎంపిక విధానం, పరీక్షా విధానం మొదలైన పూర్తి వివరాలను RRB అధికారిక వెబ్‌సైట్ www.indianrailways.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.

రైల్వే జోన్ల వారీగా ఖాళీలు:

సెంట్రల్ రైల్వే - 376

తూర్పు మధ్య రైల్వే - 700

తూర్పు తీర రైల్వే - 1461

తూర్పు రైల్వే - 868

నార్త్ సెంట్రల్ రైల్వే - 508

నార్త్ ఈస్టర్న్ రైల్వే - 100

నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే - 125

ఉత్తర రైల్వే - 521

నార్త్ వెస్ట్రన్ రైల్వే - 679

దక్షిణ మధ్య రైల్వే - 989

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే - 568

సౌత్ ఈస్టర్న్ రైల్వే - 921

దక్షిణ రైల్వే - 510

పశ్చిమ మధ్య రైల్వే - 759

పశ్చిమ రైల్వే - 885

మెట్రో రైల్వే కోల్‌కతా - 225

మొత్తం - 9,970

ఇప్పుడు దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో, ఈ రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్ ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా మారింది. అలాంటప్పుడు సరైన సమయానికి అప్లై చేయడం చాలా ముఖ్యం. ఒక్కసారిగా చివరి తేదీ దాటి పోయాక అవకాశం కోల్పోకుండా ముందుగానే అన్ని వివరాలు చూసుకుని, అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుని దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయడం మంచిది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా, రైల్వే శాఖలో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం, భద్రత, స్థిర ఆదాయం కలిగిన జీవితం సాధ్యపడుతుంది. కాబట్టి ఉద్యోగాన్ని కోరుకునే వారు ఈ అవకాశాన్ని చిన్నచూపు చూడకుండా పట్టుదలతో ముందుకెళ్లాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories