SBI Jobs: నిరుద్యోగులకు శుభవార్త..ఈ ఏడాది 10,000పోస్టుల భర్తీకి ఎస్బిఐ ప్లాన్

SBI
x

SBI Jobs: నిరుద్యోగులకు శుభవార్త..ఈ ఏడాది 10,000పోస్టుల భర్తీకి ఎస్బిఐ ప్లాన్

Highlights

SBI Jobs: నిరుద్యోగులకు ఎస్బిఐ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఏకంగా పదివేల ఉద్యోగాలకు రిక్రూట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.

SBI Jobs: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బిఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా పదివేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. సాధారణ బ్యాంకింగ్ అవసరాలతోపాటు బ్యాంక్ సాంకేతికతను అప్ గ్రేడ్ చేయడమే లక్ష్యంగా ఈ రిక్రూట్ మెంట్ చేయాలని డిసైడ్ అయ్యింది. తమ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం వాటిల్లకుండా సేవలు అందించడం కోసం అలాగే తమ డిజిటల్ ఛానెల్స్ ను మరింత బలోపేతం చేయడం కోసం ఎస్బిఐ ఇప్పటికే టెక్నాలజీపై చాలా పెట్టుబడి పెట్టింది.

జనరల్ బ్యాంకింగ్ టెక్నాలజీ అప్ గ్రేడ్స్ కోసం మా ఉద్యోగుల సంఖ్యను మరింత పెంచుకోవాలని భావిస్తున్నాము. మేము ఈమధ్యే 1500ఎంట్రీ లెవల్, హయ్యర్ లెవెల్ టెక్నాలజీ ఎక్స్ పర్ట్స్ రిక్రూట్ మెంట్ ను కూడా ప్రకటించాము. మా టెక్నాలజీ రిక్రూట్ మెంట్ ద్వారా డేటా సైంటిస్టులు, డేటా ఆర్కెటెక్ట్స్ , నెట్ వర్క్ ఆపరేటర్లు మొదలైన టెక్నాలజీ ఎక్స్ పర్ట్స్ నియమించుకుంటాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మా అవసరాల ద్రుష్ట్యా 8వేల నుంచి 10వేల మంది ఉద్యోగులను నియమించుకుంటాము. వీరిలో సాధారణ బ్యాంకింగ్ సేవలు అందించేవారితోపాటు సాంకేతిక నిపుణులు కూడా ఉంటారని చల్లా శ్రీనివాసులు శెట్టి ఎస్బీఐ చైర్మన్ తెలిపారు.

2024 మార్చి నాటికి ఎస్బిఐలో 2,32,296 మంది ఉద్యోగులు ఉండగా వీరిలో 1,10,116 మంది ఆఫీసర్ స్థాయి ఉద్యోగులు ఉన్నారు. కాలం గడుస్తున్నా కొద్దీ కస్టమర్ల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అలాగే సాంకేతికత కూడా డెవలప్ అవుతోంది. విస్త్రుత స్థాయిలో డిజిటలైజేషన్ జరుగుతోంది. అందుకే ఎస్బీఐ ఉద్యోగులకు కాలనుగుణంగా రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ చేస్తున్నాము అని ఎస్బిఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 22, 542 బ్రాంచ్ లు ఉండగా..వీటికి తోడుగా బ్యాంక్ నెట్ వర్క్ విస్తరణలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 600 కొత్త శాఖలను ప్రారంభించాలని ఆలోచిస్తున్నామని ఎస్బిఐ చైర్మన్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories