పదోతరగతితో కానిస్టేబుల్‌ ఉద్యోగం.. ఎటువంటి పరీక్ష లేదు.. వారికి మాత్రమే..!

SSB Constable Recruitment Only Candidates from Sports Quota are Eligible
x

పదోతరగతితో కానిస్టేబుల్‌ ఉద్యోగం.. ఎటువంటి పరీక్ష లేదు.. వారికి మాత్రమే..!

Highlights

పదోతరగతితో కానిస్టేబుల్‌ ఉద్యోగం.. ఎటువంటి పరీక్ష లేదు.. వారికి మాత్రమే..!

SSB Constable Recruitment: పదో తరగతి ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే నిరుద్యోగులకి ఇది శుభవార్తనే చెప్పాలి. సశాస్త్ర సీమ బల్ (SSB) GD కానిస్టేబుల్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విశేషమేమిటంటే ఈ పోస్టులకి ఎటువంటి పరీక్ష ఉండదు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి.

ఈ పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులు సశాస్త్ర సీమ బాల్ అధికారిక వెబ్‌సైట్ sscrectt.gov.inని సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ CPC ప్రకారం లెవల్ 3 కింద రూ.21000, ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తం 399 కానిస్టేబుళ్ల ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే ఒక్క విషయం మాత్రం మరిచిపోకండి. స్పోర్ట్స్ కోటాకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి. అభ్యర్థులు SSB కానిస్టేబుల్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories