Career News: అమ్మాయిలకు ఈ 5 ఉత్తమ కెరియర్‌ ఎంపికలు.. డిమాండ్‌తో పాటు మంచి జీతం..!

Career News: అమ్మాయిలకు ఈ 5 ఉత్తమ కెరియర్‌ ఎంపికలు.. డిమాండ్‌తో పాటు మంచి జీతం..!

Jyothi
Published on: 26 May 2023 11:39 AM IST
These 5 best Career Options for Girls can be Said to be Good Salary along with Demand
X

Career News: అమ్మాయిలకు ఈ 5 ఉత్తమ కెరియర్‌ ఎంపికలు.. డిమాండ్‌తో పాటు మంచి జీతం..!

Career News: నేటి కాలంలో అమ్మాయిలు అన్ని ఉద్యోగాలు చేస్తున్నారు. పురుషుల ఆధిపత్యం నశించింది. అన్ని రంగాల్లోను మహిళలు రాణిస్తున్నారు. అయితే 2023 సంవత్సరంలో అమ్మాయిలకి మంచి విజయాన్ని అందించే కొన్ని కెరీర్ ఎంపికలు ఉన్నాయి. ఈ రంగాలలో చేరిన వారికి మంచి డిమాండ్‌తో పాటు బాగా సంపాదన ఉంటుంది. ఆ రంగాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఏరోస్పేస్ ఇంజనీర్

ఏరోస్పేస్ ఇంజనీర్ విమానం, అంతరిక్ష నౌకల రూపకల్పన, అభివృద్ధిపై పనిచేస్తారు. ఈ ఫీల్డ్ చాలా బాగుంటుంది. అంతేకాదు ఇందులో డబ్బు దండిగా సంపాదించవచ్చు. ఇది కాకుండా మహిళలకు ఇందులో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఫార్మసిస్ట్‌లు

ఆసుపత్రులు, ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఫార్మసిస్ట్‌లుగా ఉద్యోగం చేయవచ్చు. ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో ఎల్లప్పుడూ వీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కోవిడ్-19 తర్వాత ఈ రంగానికి చాలా డిమాండ్‌ పెరిగింది. అమ్మాయిలు ఈ రంగంలో కెరీర్‌ను ఎంచుకోవచ్చు. అందమైన జీతంతో ఉద్యోగం సులభంగా లభిస్తుంది.

లాయర్ అవ్వండి

ఈరోజుల్లో మహిళలు లా చదివి లీగల్‌ అడ్వైజర్‌గా కూడా చేరుతున్నారు. కార్పొరేట్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా, మెడికల్ లా వంటి ఏదైనా ఒక బీట్‌లో స్పెషలైజేషన్ సాధిస్తే మీరు విపరీతంగా సంపాదించవచ్చు. ఇందులో మహిళలు విజయవంతమైన కెరీర్‌ను సాధించగలరు. ఇది అత్యధిక వేతనం పొందే ఉద్యోగాలలో ఒకటిగా చెప్పవచ్చు.

సోషల్ మీడియా జాబ్స్

అమ్మాయిలు ఇటీవల ఈ రంగంలో కెరీర్ చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అనుభవం పెరగడంతో ఈ రంగంలో 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు.

మార్కెటింగ్ మేనేజర్

మహిళలు ఈ రంగంలో ముందుకు వచ్చి బాగా డబ్బు సంపాదిస్తున్నారు. అనుభవం తర్వాత ఈ రంగంలో చాలా మంచి జీతం ఆఫర్లు పొందుతున్నారు. మీరు 2023 సంవత్సరంలో ఈ కెరీర్ ఎంపిక గురించి ఆలోచించవచ్చు.

Jyothi

Jyothi

Next Story