Group-1: గ్రూప్1 అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

Group-1: తెలంగాణలో గ్రూప్‌- 1 ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్‌ టికెట్లను టీజీపీఎస్సీ (TGPSC) శనివారం విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 1 Jun 2024 3:21 PM IST
TSPSC Group 1 Admit Card 2024 Released
X

Group-1: గ్రూప్1 అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

Group-1: తెలంగాణలో గ్రూప్‌- 1 ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్‌ టికెట్లను టీజీపీఎస్సీ (TGPSC) శనివారం విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inను సందర్శించి TSPSC గ్రూప్ 1 హాల్ టికెట్ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు వారి ID, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసిన తర్వాత వచ్చిన క్యాప్చాను ఎంటర్ చేయడం ద్వారా హాల్ టిక్కెట్లను పొందవచ్చు.

జూన్‌ 9న ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని వెల్లడించింది. రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.03 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

హాల్‌ టికెట్ల కోసం క్లిక్‌ చేయండి

Arun Chilukuri

Arun Chilukuri

Next Story