దిల్లీలో 50కిపైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్.. భారీగా డబ్బులు డిమాండ్!

దిల్లీలో 50కిపైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్.. భారీగా డబ్బులు డిమాండ్!
x

Bomb Threat Emails to Over 50 Schools in Delhi, Huge Ransom Demanded!

Highlights

దిల్లీలో 50కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్.. భారీగా డబ్బులు డిమాండ్! విద్యార్థులను ఖాళీ చేసి, పోలీసులు, బాంబ్ స్క్వాడ్ గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

రాజధాని దిల్లీ మరోసారి బాంబు బెదిరింపులతో కకావికలమైంది. బుధవారం ఉదయం నగరంలోని 50కిపైగా పాఠశాలలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు.

పోలీసులు గాలింపు చర్యల్లోకి

దిల్లీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్ వెంటనే పాఠశాలలకు చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. విద్యార్థులు, సిబ్బందిని ముందుజాగ్రత్త చర్యగా ఖాళీ చేశారు. సెక్యూరిటీ టీమ్స్ భవనాలు, ప్రాంగణాలను శోధిస్తున్నాయి.

గతంలో కూడా ఇలాగే

సోమవారం కూడా దిల్లీలో 32 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆ సమయంలోనూ పెద్ద ఎత్తున తనిఖీలు జరిగాయి. తాజా ఘటనతో మరోసారి తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్‌ల నుంచి తీసుకెళ్లేందుకు పరుగులు తీశారు.

ద్వారకాలోని Delhi Public School, Modern Convent School, Shriram World School లకు కూడా ఈసారి బెదిరింపు మెయిల్ వచ్చినట్టు సమాచారం.

డిమాండ్ చేసిన డబ్బు.. 48 గంటల బెదిరింపు!

ఈమెయిల్స్‌లో ‘Terrorizers 111’ అనే గ్రూప్ 25,000 బిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే 48 గంటల్లో బాంబు పేల్చేస్తామని హెచ్చరించింది.

అదే కాకుండా పాఠశాలల ఐటీ సిస్టమ్స్ హ్యాక్ చేస్తామని, భవనాల్లో పైప్ బాంబులు, IEDలు అమర్చుతామని కూడా పేర్కొన్నారు.

నకిలీ బెదిరింపుల చరిత్ర

దిల్లీలో స్కూళ్లకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు కొత్తేమీ కావు.

  1. గత ఏడాది మేలో దాదాపు 300 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
  2. జూలైలో వరుసగా మూడు రోజుల్లో ఎనిమిది స్కూళ్లకు మెయిల్స్ వచ్చాయి.
  3. దిల్లీ యూనివర్సిటీకి చెందిన St. Stephen’s College కి కూడా తప్పుడు RDX, IED బెదిరింపులు చేసిన ఘటనలు ఉన్నాయి.
Show Full Article
Print Article
Next Story
More Stories