ఉదయం ముక్కు మూసుకుపోతుందా? కారణాలు ఇవే – నివారణకు 6 అద్భుత చిట్కాలు!

ఉదయం ముక్కు మూసుకుపోతుందా? కారణాలు ఇవే – నివారణకు 6 అద్భుత చిట్కాలు!
x
Highlights

తెల్లవారుజామున ముక్కు మూసుకుపోతుందా? కారణాలు, లక్షణాలు, డాక్టర్ సూచించిన 6 నివారణ చిట్కాలు తెలుసుకోండి. సలైన్ స్ప్రే, ఆవిరి పట్టడం, గది పరిశుభ్రతతో ముక్కు బ్లాక్ సమస్యకు శాశ్వత పరిష్కారం.

తెల్లవారుజామున లేవగానే ముక్కు పట్టేసి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు అలెర్జీలు, గాలి పొడిబారడం, సైనసైటిస్, లేదా ముక్కు మధ్య గోడ వంగిపోవడం కావొచ్చు. రాత్రిపూట శ్లేష్మం పేరుకుపోవడం, రక్తప్రసరణ పెరగడం వల్ల కూడా ఉదయం ముక్కు మూసుకుపోతుంది.

హైదరాబాద్ యశోదా హాస్పిటల్‌కి చెందిన ఈఎన్‌టీ నిపుణుడు డాక్టర్ మనుశ్రుత్ ప్రకారం, ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం కంటే సమయానుకూలంగా పరిష్కారం తీసుకోవడం చాలా ముఖ్యం.

ముక్కు మూసుకుపోవడానికి ప్రధాన కారణాలు

  1. అలెర్జీలు – దుమ్ము, దూళి, జంతు చర్మపు పొట్టు, బూజు మొదలైనవి.
  2. గాలి పొడిబారడం – ఎయిర్ కండీషనర్లు లేదా హీటర్ల వాడకం.
  3. ఫ్యాన్ కింద నిద్ర – నేరుగా ఫ్యాన్ గాలి తగలడం వల్ల ముక్కు ఎండిపోతుంది.
  4. ఆమ్లం పైకి రావడం (Reflux) లేదా కొన్ని నిద్ర భంగిమలు.

ఉపశమనం కోసం 6 చిట్కాలు

1. సలైన్ స్ప్రే:

పడుకునే ముందు, ఉదయం లేవగానే సలైన్ స్ప్రే లేదా ఉప్పు నీటితో ముక్కును శుభ్రం చేసుకోండి.

2. బెడ్‌రూమ్ పరిశుభ్రత:

బెడ్‌షీట్లు, దిండు కవర్లను ప్రతి వారం వేడి నీటితో ఉతికేయండి.

3. డస్ట్ మైట్ కవర్లు:

దుమ్ము పురుగులను నివారించే కవర్లు వాడండి. పెంపుడు జంతువులను పడక గదికి దూరంగా ఉంచండి.

4. హ్యుమిడిఫైయర్:

గదిలో గాలి పొడిగా ఉంటే తేమ పెంచడానికి హ్యుమిడిఫైయర్ ఉపయోగించండి.

5. సువాసనలు వద్దు:

రూమ్ ఫ్రెషనర్లు, అగరబత్తులు వాడకండి — ఇవి ముక్కు మార్గాలను ఇర్రిటేట్ చేస్తాయి.

6. ఆవిరి పట్టడం:

ఉదయం 5–10 నిమిషాలు ఆవిరి పట్టడం ద్వారా శ్లేష్మం కరిగి ముక్కు మార్గాలు తెరుచుకుంటాయి.

డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

  • రెండు వారాలకంటే ఎక్కువ కాలం ముక్కు బ్లాక్‌గా ఉండడం.
  • గురక, వాసన కోల్పోవడం, ముఖంపై ఒత్తిడి, తరచూ సైనస్ తలనొప్పులు ఉంటే.

ఈ పరిస్థితుల్లో సైనసైటిస్, నాసల్ పాలిప్స్ లేదా వంగిన సెప్టం కారణం కావచ్చు. వైద్యుల సలహా, అవసరమైతే చికిత్స లేదా చిన్నపాటి సర్జరీతో సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories