Diabetes: చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? డయాబెటిస్‌ కావొచ్చు..

Diabetes: చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? డయాబెటిస్‌ కావొచ్చు..
x
Highlights

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని డయాబెటిస్‌గా పిలుస్తారని తెలిసిందే.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని డయాబెటిస్‌గా పిలుస్తారని తెలిసిందే. క్లోమం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోయినా లేదా శరీరం ఉత్పత్తి చేసిన ఇన్సులిన్‌ను సమర్థంగా ఉపయోగించలేకపోయినా ఈ సమస్య వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారంగా 2022 నాటికి 18 సంవత్సరాలు పైబడి ఉన్న పెద్దలలో 14% మంది మధుమేహంతో బాధపడుతున్నారు. డయాబెటిస్ అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, ముఖ్యంగా చర్మంపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మీ చర్మం ద్వారా డయాబెటిస్ సంకేతాలను ముందుగానే గుర్తించవచ్చు. ఇంతకీ చర్మంపై కనిపించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్‌ పెరిగితే మూత్రపిండాలు అధికంగా పనిచేస్తాయి.దీని వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది. దీంతో చర్మం పొడిగా మారుతుంది. ఈ సమస్య ప్రధానంగా కాళ్లు, చేతులు, మోచేయి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. రక్తంలో అధిక చక్కెర కారణంగా శరీరంలోని గాయాలు మానడానికి మామూలు కంటే ఎక్కువ సమయం పడుతుంది. చిన్న చిన్న గీతలు, కోతలు, గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటే ఇది డయాబెటిస్‌కు సంకేతం కావచ్చు. అధిక రక్త చక్కెర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, దీంతో బ్యాక్టీరియా, ఫంగస్ తేలిగ్గా ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.

మెడ, చంకలు, మోచేయి, గజ్జల చుట్టూ నల్లగా మచ్చలు రావడం ఇన్సులిన్ నిరోధకతకు సంకేతంగా చెప్పొచ్చు. ఇది ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చిన వారికి కనిపించవచ్చు. రక్తంలో చక్కెర శాతం పెరిగే శరీరంలో మంటను పెంచుతుంది. దీని ఫలితంగా చర్మంపై ఎర్రబారడం, వాపు, చికాకు ఎక్కువగా కనిపించవచ్చు. ముఖ్యంగా కాళ్లు, మోకాళ్లు, చంకల ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

చర్మం పొడిగా మారితే ఎక్కువ నీరు తాగడం, మాయిశ్చరైజర్ ఉపయోగించడం మంచిది. చిన్న గాయాలు ఉన్నా వెంటనే చికిత్స తీసుకోవాలి. చర్మ ఇన్ఫెక్షన్లను తేలికగా తీసుకోకూడదు, డాక్టర్ సూచించిన మెడిసిన్‌ వాడాలి. నల్లటి మచ్చలు వస్తే, రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories