AP Natural Farming: ప్రపంచానికి ఆదర్శంగా ఏపీలో ప్రకృతి సాగు - సీఎం చంద్రబాబు

AP Natural Farming: ప్రపంచానికి ఆదర్శంగా ఏపీలో ప్రకృతి సాగు - సీఎం చంద్రబాబు
x

AP Natural Farming: ప్రపంచానికి ఆదర్శంగా ఏపీలో ప్రకృతి సాగు - సీఎం చంద్రబాబు

Highlights

ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకృతి సేద్యం ప్రాధాన్యతను వివరించారు. ఏపీలో ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యం, పర్యావరణం, ఆర్థికాభివృద్ధి సాధ్యమని తెలిపారు.

AP Natural Farming: ప్రకృతి సాగు చేయాలని... భూమిని బాగు చేసేలా వ్యవసాయం, ఆహార ఉత్పత్తులను పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తులపై హైలెవల్ మీటింగ్... అలాగే రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... ఏపీలో ప్రకృతి సేద్యానికి తీసుకుంటోన్న చర్యలను వివరించారు. అలాగే గ్లోబల్ మార్కెట్లో నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ కు ఉన్న డిమాండుకు తగ్గట్టు రాష్ట్రం ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...”ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేసేందుకు పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉంది. ప్రకృతి సేద్యం అనేది కేవలం ఒక వ్యవసాయ పద్ధతి మాత్రమే కాదు, వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక శక్తివంతమైన ఆయుధం. రాష్ట్రంలో ఇప్పటికే 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ఎటువంటి ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రకృతి సేద్యానికి సంబంధించి ప్రపంచానికే ఏపీని ఓ నమూనాగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. ఎరువుల వినియోగం.. రసాయనాల వినియోగంతో చేసే వ్యవసాయంతో పోలిస్తే, ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. రైతులకు మొదటి సంవత్సరం నుంచే అధిక నికర ఆదాయం లభిస్తోంది... రైతులు బలోపేతం కావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.”అని ముఖ్యమంత్రి వివరించారు.

పర్యావరణానికి మేలు చేసేలా... గ్లోబల్ మార్కెట్టుకు తగ్గట్టుగా...

“ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమిలో కార్బన్ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది... అలాగే పర్యావరణానికి మేలు జరుగుతుంది. అలాగే నీటి వినియోగం తగ్గడంతో పాటు... బయోడైవర్సిటీ పెరిగేలా చూసుకోవచ్చు. అలాగే భూసారం తగ్గకుండా... భూమిని మరింత బలంగా... పోషకాలు ఉండేలా చేసుకోవచ్చు. ఫార్మర్ టు ఫార్మర్ అనే పద్దతిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి గ్రామానికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక ప్రకృతి సేద్యంలో అనుభవజ్ఞులైన రైతులు ఇతర రైతులకు శిక్షణ ఇచ్చేలా వ్యవస్థను రూపొందించాం. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లలో ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి వీలుగా సరైన మార్కెటింగ్ వ్యవస్థను, సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. టెక్నాలజీని ఉపయోగించి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని, పర్యావరణాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులను సిద్దం చేస్తోంది. అయితే ప్రకృతి సాగును ప్రొత్సహించేందుకు మెరుగైన పారిశ్రామిక పద్దతులు, ఆర్థిక ప్రొత్సాహకాలు అవసరం. వ్యాపార సంస్థలు తమ ఆర్థిక లాభాల పరంగానే కాకుండా... పర్యావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్టులో ఉన్న డిమాండ్ ను అంచనా వేసుకుంటూ... అంతర్జాతీయంగా రాష్ట్ర ఉత్పత్తులను ఎగుమతులు చేసేలా భారీ ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు... ఓ పెద్ద బిజినెస్ ఆపర్చునిటీగా నిరూపించే దిశగా ఏపీలోని రైతులను సిద్దం చేస్తున్నాం.”అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories