బీటెక్ చదివి బర్రెల పెంపకం.. ప్రతి నెల రూ.60వేల ఆదాయం..

బీటెక్ చదివి బర్రెల పెంపకం.. ప్రతి నెల రూ.60వేల ఆదాయం..
Dairy Farming: పల్లెటూరి యువకుడు పట్టణాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివాడు..
Dairy Farming: పల్లెటూరి యువకుడు పట్టణాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివాడు పలు కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు సైతం పొందాడు కానీ అవేమీ అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి పుట్టి పెరిగిన ఊరిపై మమకారం తీరక, సొంతూరులోనే స్వయం ఉపాధి పొందాలన్న ఆలోచనకు వచ్చాడు కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మిన ఆ యువకుడు పాడి పశువుల పెంపకాన్ని లాభసాటిగా మార్చుకుంటూన్నాడు. ఈ రంగంలోనే క్రమంగా అభివృద్ధి చెందుతూ మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా యువ రైతుపై ప్రత్యేక కథనం.
ఈ యువకుని పేరు నోముల అనీష్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి స్వగ్రామం. ఈ యువకుడు బీటెక్ వరకు చదువుకున్నాడు తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయం చేస్తూ కష్టపడి అనీష్‌రెడ్డిని ఉన్నత చదువులు చదివించారు. 2013లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత అనీష్‌రెడ్డి హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేశాడు. ఆదాయం బాగున్నా సంతృప్తి లేకపోవడంతో స్వగ్రామం చేరుకున్నాడు. గ్రామంలోనే స్వయం ఉపాధి పొందాలన్న తన ఆలోచననను తల్లిదండ్రులకు తెలిపి వారిని ఒప్పించి వ్యవసాయ అనుబంధరంగంవైపు అడుగులు వేశాడు. 2015లో ఎనిమిది గేదెలతో పాడి పశువుల పెంపకం చేపట్టాడు. ప్రతి నెల ఉద్యోగిమాదిరి ఆదాయాన్ని పొందుతున్నాడు.
పాడి పశువుల పెంపకంలో అనీష్ రెడ్డి మొదట్లో కొద్దిగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. అయినా ధైర్యంగా ముందుకెళ్లాడు. బ్యాంకు ద్వారా 3 లక్షల రూపాయల రుణం తీసుకుని క్రమక్రమంగా పశువుల సంఖ్యను పెంచుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ యువరైతు తనకున్న నాలుగు ఎకరాల పొలంలో 72 ఆవులు, గేదెలతో డెయిరీని నిర్వహిస్తున్నాడు. ప్రతి రోజూ 200 లీటర్ల పాలను ఆదిలాబాద్‌కు తీసుకెళలి విక్రయిస్తున్నాడు. అన్ని ఖర్చులు పను నెలకు 50 నుంచి 60 వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నాడు. తాను ఉపాధి పొందడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు అనీష్. కష్టపడే తత్వం ఉంటే చాలు కొలువులపై ఆధారపడాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నాడు అనీష్‌రెడ్డి. తోటి యువకులు అనీష్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటారని మనమూ ఆశిద్దాం.
ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMTతిరుమలలో తెలుగమ్మాయి, అమెరికా అబ్బాయి పెళ్లి
6 Aug 2022 6:05 AM GMTKomatireddy Venkat Reddy: రేవంత్ పెద్ద తప్పు చేశారు.. ఇకపై ఆయన ముఖం కూడా చూడను..
5 Aug 2022 7:27 AM GMT
Telangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTఎన్టీఆర్ తో నటించే అవకాశం కోల్పోయిన సమంత
8 Aug 2022 9:20 AM GMTసినీ ఇండస్ట్రీపై దిల్ రాజు కీలక కామెంట్స్
8 Aug 2022 7:32 AM GMTరాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం.. ఆరు నెలల్లోపు..
8 Aug 2022 7:26 AM GMT