రంగుల పుచ్చకాయలు సాగుచేస్తూ... అందర్నీ అబ్బుర పరుస్తున్న కోనసీమ జిల్లా రైతు..

Cultivation of Three Types of Watermelon
x

రంగుల పుచ్చకాయలు సాగుచేస్తూ... అందర్నీ అబ్బుర పరుస్తున్న కోనసీమ జిల్లా రైతు..

Highlights

Watermelon Farming: పంటలు అందరు రైతులు పండిస్తారు కానీ వినూత్న విధానాలు ఆచరించి, ఎవరు సాగుచేయని పంటలు పండిస్తే వారికీ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.

Watermelon Farming: పంటలు అందరు రైతులు పండిస్తారు కానీ వినూత్న విధానాలు ఆచరించి, ఎవరు సాగుచేయని పంటలు పండిస్తే వారికీ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ పంటల్లో లాభాలు గడిస్తే అందరి దృష్టిలో మారుమోగిపోతారు. అచ్చం అలానే అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, కేశనపల్లి గ్రామానికి, చెందిన దొమ్మేటి శ్రీనివాస్ అనే రైతు... కొత్తగా ఆలోచన చేసి గత మూడు సంత్సరాలుగా రకరకాల రంగుల పుచ్చకాయలు సాగుచేస్తూ అందర్నీ అబ్బుర పరుస్తున్నాడు. సహజంగా మనకు ఎరుపు గుజ్జు కలిగిన పుచ్చ రకాలు తెలుసు ,కానీ ఈ రైతు పసుపు గుజ్జు ,తొక్క పసుపు కలిగిన పుచ్ఛతో పాటు, గింజలు తక్కువ కలిగి, ఎరుపు గుజ్జు కలిగిన.. పుచ్చ రకాలు సాగుచేసి..గుర్తింపు తెచ్చుకున్నాడు.

అందరు రైతులు లాగానే సంప్రదాయ పంటలు సాగుచెయ్యాలి అనుకోలేదు దొమ్మేటి శ్రీనివాస్ అనే ఈ రైతు. విభిన్నంగా ఆలోచన చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో పంట దిగుబడి ఇచ్చే పుచ్చ సాగు ఎంచుకున్నాడు, అందున తన పొలం పుచ్చకు అనుకూలం కావటం తో సాధారణ పుచ్ఛ రకాలకు బదులు విదేశిరకాలు ఎన్నుకున్నాడు. మూడు సంవత్సరాల క్రితం, రెండు ఎకరాల కౌలు భూమి లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి వరుసగా ఈ మూడో ఏడాది ఎనిమిది ఎకరాల్లో మూడు రంగుల పుచ్చకాయలు సాగు చేస్తూ మంచి లాభాలను ఆశిస్తున్నాడు. ఆధునిక సాంకేతిక పద్ధతులు పాటించటం తో చక్కటి దిగుబడులు తన సొంతం అవుతున్నాయి.

పుచ్చ సాగు వేసవికి అనువైన పంట. కానీ ప్రస్తుత కాలంలో అన్ని కాలాలను అనువైన రకాలు రావడం వల్ల ఇక్కడ రైతులు అన్నికాలాల్లోనూ సాగు చేస్తున్నారు. ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో సాగునీటి వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో ఒకటే రకం కాకుండా, విభిన్న రకాలు పుచ్ఛలు వేశారు ఈ రైతు . దీనిపై స్థానికులు సైతం తమ పొడి భూముల్లో ఇటువంటి పంటలు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం తన వ్యవసాయ భూమిలో.. పసుపు రకం, ఎరుపు రకం, పైన పసుపు... లోపల ఎరుపు గుజ్జు రకం వంటి మూడు రకాలుగా సాగు చేస్తున్నారు శ్రీనివాస్. మల్చింగ్ విధానంతో, డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులు అందించడంతో పంట ఆరోగ్యంగా పెరిగి 65 రోజులకే పంట కోతకొచ్చి మంచి దిగుబడులు తీస్తున్నారు.

అయితే గతంలో కురిసిన అకాల వర్షాలు కారణంగా చాలావరకు పంట నష్టానికి గురైనట్లు శ్రీనివాస్ వాపోయారు. లేకుంటే ఈ ఏడాది మరింత మంచి లాభాలు ఉండేవి అంటున్నాడు. పొలం వద్దే హోల్ సేల్ రేట్లకు పుచ్చకాయలు అమ్మడంతో సుదూర ప్రాంతాల నుంచి సైతం వినియోగదారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఆకర్షవంతమైన రంగుల్లో కాయలు లభ్యం కావడంతో మక్కువ చూపుతున్నారు . పుచ్చ కాయలు రంగుతో పాటు ,రుచిగా ఉన్నాయి అంటున్నారు వినియోగదారులు. వైవిధ్యమైన పంటలతో రాబడి పొందుతున్న రైతు శ్రీనివాస్, తోటి రైతులకు ప్రేరణకలిగిస్తున్నాడు. సాగువిధానాలు గమనించిన రైతులు పుచ్చసాగుకు సిద్ద పడుచున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories