365 రోజులు గులాబీల సువాసనలు.. యువరైతు లాభాల సాగు..

Farmers Success Story of Rose Farming
x

365 రోజులు గులాబీల సువాసనలు.. యువరైతు లాభాల సాగు..

Highlights

Rose Farming: బీటెక్ చదివాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏసీ గదుల్లో హైటెక్ ఉద్యోగం లభించింది.

Rose Farming: బీటెక్ చదివాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏసీ గదుల్లో హైటెక్ ఉద్యోగం లభించింది. ఆదాయమూ లాభదాయకంగానే వస్తోంది. కానీ అవేమీ ఆ యువకుడికి సంతృప్తిని అందించలేకపోయాయి. నాలుగు గోడల మధ్య చేసే ఉద్యోగంలో లభించని సంతోషాన్ని ప్రకృతి ఒడిలో పొందుదామని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి ఏ‌ళ్లుగా కొనసాగిస్తున్న వ్యవసాయాన్నే తన భవిష్యత్తుకు బంగారు బాటగా మలచుకున్నాడు. స్థానిక వాతావరణ పరిస్థితులకు గమనించి, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల గురించి తెలుసుకుని, ఏడాది పొడవునా ఆదాయం వచ్చే గులాబీల సాగుకు శ్రీకారం చుట్టాడు ఏలూరు జిల్లాకు చెందిన యువరైతు పృథ్వీ. ప్రతి నెల నికర ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అందమైన పుష్పాల్లో గులాబీ ఒకటి. పూలల్లో కెల్లా రారాణి గులాబీ పువ్వు. వాణిజ్యపరంగా గులాబీల సాగులో ఉన్న లాభాలను ఇప్పుడిప్పుడే రైతులు గమనిస్తున్నారు. గులాబీల సాగులో మెళకువలను తెలుసుకుని ఆ దిశగా రైతులు దృష్టిసారిస్తున్నారు. తక్కువ ఖర్చు, తక్కువ భూమి, ఎక్కువ ఆదాయం గులాబీల సాగుతో పొందవచ్చు. నేడు గులాబీల సాగు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చిన్న పట్టణాల్లో కూడా రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ విజయాన్ని గుర్తించిన ఏలూరు జిల్లాకు చెందిన యువరైతు పృథ్వీ తమకున్న 15 ఎకరాల్లో గులాబీల సాగు చేపట్టాడు. లాభాల బాటలో పయనిస్తున్నాడు.

మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పృథ్వీకి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసిన అనుభం ఉంది. అయితే ఇవేమీ అతనికి సంత్రృప్తిని అందించలేకపోయాయి. సాగు వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకుని సొంతూరైన ఏలూరు జిల్లాలోని కళ్లచెరువుకు వచ్చేశాడు. తండ్రి చేసిన వ్యవసాయాన్నే సరికొత్త పంథాలో నడిపించడం మొదలు పెట్టాడు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన, మార్కెట్ అధికంగా ఉన్న గులాబీల సాగుపై దృష్టి సారించాడు. బెంగుళూరులో పూల తోటలును పరిశీలించి సాగుపై అవగాహన పెంచుకుని ఈ యువ రైతు మెట్టు ప్రాంతంలో గులాబీల సాగు మొదలు పెట్టాడు. ఇపుడు ఉభయగోదావరి జిల్లాలకు మేలురకాల పూలను అందిస్తున్నాడు.

గత ఏడాది 15 ఎకరాల్లో గులాబీ పూల సాగు ప్రారంభించిన ఈ రైతు బెంగుళూరు రకం, సెంటు రకాలను పెంచుతున్నాడు. స్థానిక వాతావరణం ఈ పూల సాగుకు అనుకూలంగా ఉందని రైతు తెలపాడు. ఒకసారి మొక్కలు నాటితే 6 నుంచి 8 ఏళ్ల వరకు పూల కోత లభిస్తుందని, మొక్క నాటిన 5 నెలల నుంచి పూల దిగుబడి అందుతుందని చెప్పాడు. మూడు సీజన్‌లకు కలిపి ప్రతి నెల 400 కేజీల పూల వరకు విక్రయిస్తామని నెలకు నికరంగా 60 నుంచి 70 వేల వరకు లాభం దక్కుతోందని ఈ యువరైతు హర్షం వ్యక్తం చేశాడు.

గులాబీ పూల పెంపకంలో ప్రకృతి విధానాలను అనుసరిస్తున్నాడు ఈ యువరైతు. సమయానుకూలంగా ప్రతి 15 రోజులకు ఒకసారి కోళ్ళు, పశువుల వ్యర్థాలతో చేసిన ప్రకృతి ఎరువులను మొక్కలకు అందిస్తున్నారు. సాధారణ పద్ధతులు కాకుండా డ్రిప్ విధానంలో నీరు అందిస్తున్నారు. సాధారణ పద్ధతుల్లో అయితే విల్ట్ సమస్య వస్తుందని తెలిపాడు. ఇప్పటి వరకు తాను అనుసరించే విధానాల కారణంగా గులాబి తోటల ఎలాంటి చీడపీడలు ఆశించలేని. ఏడాది పొడవునా పూల దిగుబడి అందుతోందని చెప్పుకొచ్చాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories