Farmland vs Real Estate: వ్యవసాయ భూమి vs రియల్ ఎస్టేట్.. దేనిలో పెట్టుబడి పెడితే లాభం?

Farmland vs Real Estate: వ్యవసాయ భూమి vs రియల్ ఎస్టేట్..  దేనిలో పెట్టుబడి పెడితే లాభం?
x

Farmland vs Real Estate: వ్యవసాయ భూమి vs రియల్ ఎస్టేట్.. దేనిలో పెట్టుబడి పెడితే లాభం?

Highlights

భారతదేశంలో పెట్టుబడుల విషయానికి వస్తే, చాలామందికి రెండు ఆస్తులే గుర్తుకు వస్తాయి. ఒకటి వ్యవసాయ భూమి, మరొకటి రియల్ ఎస్టేట్ (ఇళ్లు, ప్లాట్లు). ఈ రెండింటిలో ఏది పెట్టుబడి పెట్టడానికి మంచిది అని చాలా మంది మదిలో ప్రశ్న మెదలుతూ ఉంటుంది.

Farmland vs Real Estate: భారతదేశంలో పెట్టుబడుల విషయానికి వస్తే, చాలామందికి రెండు ఆస్తులే గుర్తుకు వస్తాయి. ఒకటి వ్యవసాయ భూమి, మరొకటి రియల్ ఎస్టేట్ (ఇళ్లు, ప్లాట్లు). ఈ రెండింటిలో ఏది పెట్టుబడి పెట్టడానికి మంచిది అని చాలా మంది మదిలో ప్రశ్న మెదలుతూ ఉంటుంది. ఈ రెండు పెట్టుబడి మార్గాలకు వాటి ప్రత్యేకతలు, లాభాలు, నష్టాలు ఉంటాయి. మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ కెపాసిటీ, పెట్టుబడి పెట్టే సమయాన్ని బట్టి ఏది ఎంచుకోవాలనేది ఆధారపడి ఉంటుంది. ఈ వార్తలో ఫార్మ్‌ల్యాండ్ వర్సెస్ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఫార్మ్‌ల్యాండ్ పెట్టుబడి వల్ల లాభాలు

వ్యవసాయ భూమిలో పెట్టుబడి పెట్టడం అంటే కేవలం భూమిని కొనడం మాత్రమే కాదు. దానిపై వ్యవసాయం చేయడం, లీజుకు ఇవ్వడం లేదా భవిష్యత్తులో ధర పెరిగినప్పుడు అమ్మేయడం లాంటివి ఉంటాయి.

స్థిరమైన ఆస్తి: వ్యవసాయ భూమి అనేది పరిమిత వనరు. జనాభా పెరుగుతున్న కొద్దీ ఆహారానికి డిమాండ్ పెరుగుతుంది. ఇది భూమి విలువను పెంచుతుంది.

తక్కువ హెచ్చుతగ్గులు: పట్టణ రియల్ ఎస్టేట్ మార్కెట్‌తో పోలిస్తే, వ్యవసాయ భూముల ధరలు స్థిరంగా, నెమ్మదిగా పెరుగుతాయి. ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులలో కూడా దీని విలువ పెద్దగా తగ్గదు.

మెయింటెనెన్స్ సులభం, ఆదాయం: మీరు స్వయంగా వ్యవసాయం చేయకూడదనుకుంటే భూమిని రైతులకు లీజుకు ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

ద్రవ్యోల్బణానికి రక్షణ: ఆహార పదార్థాల ధరలు పెరిగినప్పుడు, వాటిని ఉత్పత్తి చేసే భూమి విలువ కూడా పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఒక మంచి మార్గం.

సహజ జీవనం: పట్టణ జీవితానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉండాలనుకునేవారికి ఫార్మ్‌ల్యాండ్ ఒక మంచి ఆప్షన్.

రియల్ ఎస్టేట్ పెట్టుబడి వల్ల లాభాలు

రియల్ ఎస్టేట్ అంటే నివాస లేదా వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేసి వాటిని అద్దెకు ఇవ్వడం లేదా లాభం కోసం అమ్మడం.

అధిక లిక్విడిటీ: నగరాలు, ముఖ్య పట్టణాలలో ఇళ్లు లేదా ప్లాట్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే వీటిని అవసరమైనప్పుడు సులభంగా అమ్మవచ్చు.

అద్దె ఆదాయం: అపార్ట్‌మెంట్లు, ఆఫీస్ స్పేసులు, షాపులను అద్దెకు ఇవ్వడం ద్వారా నెలవారీ ఆదాయం పొందవచ్చు.

అనేక ఆప్షన్లు : రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌ల నుంచి కమర్షియల్ కాంప్లెక్స్‌ల వరకు రియల్ ఎస్టేట్‌లో అనేక రకాల పెట్టుబడులు అందుబాటులో ఉంటాయి.

లోన్ సదుపాయం: రియల్ ఎస్టేట్ కొనుగోలుకు బ్యాంకులు సులభంగా లోన్లు ఇస్తాయి. దీంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ విలువైన ఆస్తులను కొనుగోలు చేయవచ్చు.

దీర్ఘకాలిక వృద్ధి: నగరాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, జనాభా పెరుగుదల వల్ల రియల్ ఎస్టేట్ విలువ స్థిరంగా పెరుగుతుంది.

ఏది మంచిది? వ్యవసాయ భూమి లేదా రియల్ ఎస్టేట్?

మీ లక్ష్యాలను బట్టి దీనికి సమాధానం ఉంటుంది. దీర్ఘకాలిక వృద్ధి కోరుకునేవారికి ఫార్మ్‌ల్యాండ్ ఉత్తమం. ఇది తక్కువ రిస్క్, ద్రవ్యోల్బణానికి మంచి రక్షణ ఇస్తుంది. వేగంగా రాబడి, అద్దె ఆదాయం, సులభంగా అమ్ముడుపోవాలి అనుకునేవారికి రియల్ ఎస్టేట్ మంచి ఎంపిక. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారిలో, యువతలో ఫార్మ్‌ల్యాండ్‌పై ఆసక్తి పెరుగుతోంది. దీనికి కారణం ఆహార భద్రతపై అవగాహన, సేంద్రీయ వ్యవసాయం, సుస్థిర జీవనంపై ఉన్న ఆసక్తి. అలాగే, పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఫార్మ్‌ల్యాండ్ పెట్టుబడి ఒక మంచి ఆప్షన్ గా మారింది.

మృగనయని - లాభదాయక ఫార్మ్‌ల్యాండ్ పెట్టుబడులకు మీ గమ్యం

మీరు వ్యవసాయ భూమిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని మృగనయని ప్రాజెక్ట్ ఒక మంచి ఆప్షన్. సంగారెడ్డి జిల్లాలోని హై-గ్రోత్ కారిడార్‌లో ఉంది. నిమ్స్, ముంబై హైవే, జేఎన్టీయూ సుల్తాన్‌పూర్, ఐఐటీ హైదరాబాద్‌లకు దగ్గరగా ఉంది.

ప్రత్యేకతలు:

* 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్ట్.

* 100% క్లియర్ టైటిల్, పట్టా పాస్‌బుక్.

* తెలంగాణ రైతు భరోసా పథకం పరిధిలోకి వస్తుంది.

* ఏడాదికి 50 కిలోల వ్యవసాయ ఉత్పత్తులు ఉచితంగా అందిస్తారు.

* 15 సంవత్సరాల వరకు ఫార్మ్ నిర్వహణ ఉచితం.

* ప్రతి ఐదు గుంటలకు 45 పండ్ల మొక్కలు.

* ప్రతి సంవత్సరం 5 రోజులు, 4 రాత్రులు రిసార్ట్‌లో ఉచితంగా ఉండవచ్చు.

* రిసార్ట్‌లోని అన్ని సదుపాయాలపై 25% వరకు డిస్కౌంట్.

* క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, కెమెరా నిఘా, కాంపౌండ్ వాల్ ఉన్నాయి.

ధర: నెలకు రూ.32,500 నుంచి ఈఎంఐతో ప్రారంభమవుతుంది.

మరిన్ని వివరాల కోసం https://www.mruganayani.kapilfarms.in/ లేదా https://www.kapilfarms.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి. మృగనయని బృందాన్ని సంప్రదించడానికి +91-9839837280 లేదా [email protected] కు మెయిల్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories