PM Kisan: రైతన్నలకు అలెర్ట్.. ఆధార్ లింక్ లేకుంటే పీఎం కిసాన్ నిధులు బంద్.. వెంటనే ఇలా చేయండి!

PM Kisan: రైతన్నలకు అలెర్ట్.. ఆధార్ లింక్ లేకుంటే పీఎం కిసాన్ నిధులు బంద్.. వెంటనే ఇలా చేయండి!
x

PM Kisan: రైతన్నలకు అలెర్ట్.. ఆధార్ లింక్ లేకుంటే పీఎం కిసాన్ నిధులు బంద్.. వెంటనే ఇలా చేయండి!

Highlights

అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM-Kisan) 22వ విడత నిధుల విడుదలకు ముహూర్తం దగ్గర పడుతోంది.

అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM-Kisan) 22వ విడత నిధుల విడుదలకు ముహూర్తం దగ్గర పడుతోంది. అయితే, ఈసారి లక్షలాది మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దాదాపు 30 లక్షల మందికి పైగా రైతులు తమ బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించకపోవడమే దీనికి కారణం అని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 6, 2026 నాటికి ఉన్న గణాంకాల ప్రకారం.. మీరు గనుక సకాలంలో స్పందించకపోతే ఈ విడత సొమ్మును కోల్పోయే ప్రమాదం ఉంది.

30 లక్షల మందికి పైగా రైతులపై వేటు..

వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 30,18,361 మంది రైతులు ఇంకా తమ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించుకోలేదు. కేంద్రం ఇచ్చే నిధులు 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్' (DBT) పద్ధతిలో నేరుగా ఖాతాల్లోకి రావాలంటే ఆధార్ లింక్ తప్పనిసరి. పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిబంధనను మరింత కఠినతరం చేసింది.

ఏ రాష్ట్రంలో ఎంత మంది అన్నదాతలకు నిధులు రావంటే..

ఇండియాలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఏ రాష్ట్రంలో ఎంత మంది అన్నదాతలకు నిధులు రావంటే..

ఉత్తరప్రదేశ్: 10.44 లక్షల మంది.

గుజరాత్: 2.90 లక్షల మంది.

రాజస్థాన్: 2.13 లక్షల మంది.

మధ్యప్రదేశ్: 1.87 లక్షల మంది.

మహారాష్ట్ర: 1.72 లక్షల మంది.

తెలుగు రాష్ట్రాలు/ఇతర రాష్ట్రాలు: కర్ణాటక (1.30 లక్షలు), పశ్చిమ బెంగాల్ (1.22 లక్షలు) రైతులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఖాతాను ఆధార్‌తో ఎలా అనుసంధానించాలంటే..

పీఎం కీసాన్ నిధులు నిలిపివేతపై రైతన్నలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు కేవలం రెండు సులభమైన పద్ధతుల్లో మీ ఖాతాను అప్‌డేట్ చేసుకోవచ్చు.. అది ఎలా అంటే..

1. ఆన్‌లైన్ విధానం (ఇంట్లో కూర్చునే..): ముందుగా మీరు మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి. అక్కడ 'Aadhaar Seeding' లేదా 'Update Aadhaar' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. తర్వాత మీ ఆధార్ నంబర్ నమోదు చేసి, వచ్చే OTPని ఎంటర్ చేస్తే మీ పని పూర్తవుతుంది.

2. ఆఫ్‌లైన్ విధానం (బ్యాంకుకు వెళ్లి..): మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి 'ఆధార్ లింకింగ్ ఫారమ్' తీసుకోండి. దానిని పూర్తి చేసి, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ కాపీని ఆ ఫారమ్‌కు జత చేసి మేనేజర్‌కు ఇవ్వండి. ఇప్పుడు కొన్ని బ్యాంకులు SMS లేదా ATM ద్వారా కూడా ఈ సదుపాయాన్ని వినియోగదారులకు కల్పిస్తున్నాయి.

గమనిక: బ్యాంకు రికార్డుల్లో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకేలా లేకపోతే పీఏం కిసాన్ నిధులు నిలిపివేస్తామని తాజాగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి, వెంటనే మీ వివరాలను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం ఉత్తమం. అర్హత ఉన్న ప్రతి రైతుకూ సాయం అందాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఆధార్ లింకింగ్ ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మీ జేబులోకి డబ్బులు చేరుతాయని, అందుకే నియమాలను మరింత కఠినతరం చేసినట్లు చెబుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories